'మ‌హ‌ర్షి' కోసం భారీ సెట్‌

Sun,November 18, 2018 07:16 AM
huge set for maharshi movie

ఈ మ‌ధ్య కాలంలో బ‌డా హీరోల సినిమాల‌కి భారీ బ‌డ్జెట్‌తో సెట్స్ రూపొందించ‌డం కామ‌న్‌గా మారింది. రంగ‌స్థ‌లం కోసం ఏకంగా ఓ ప‌ల్లెటూరినే రూపొందించారు. ఇక ఇప్పుడు మ‌హ‌ర్షి సినిమా కోసం కూడా ప‌ల్లెటూరి సెట్ రూపొందించార‌ట‌. సుమారు నాలుగు కోట్ల ఖ‌ర్చుతో ఆర్ట్ డైరెక్ట‌ర్ సునీల్ బాబు ప‌ల్లెటూరిని త‌ల‌పించే విధంగా సెట్ తీర్చిదిద్దార‌ట‌. హైద‌రాబాద్‌లో వేసిన ఈ సెట్‌లో తాజా షెడ్యూల్ జ‌రుగుతుంది. ఇందులో కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. నెల రోజుల పాటు ఈ సెట్‌లో షూటింగ్ జర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, సెకండాఫ్‌లో వచ్చే కీల‌క సన్నివేశాలన్నింటిని దాదాపు ఈ సెట్‌లోనే చిత్రీక‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌ల‌తో పాటు ప్ర‌ధాన చిత్ర బృందం అంతా పాల్గొన‌నున్నార‌ట‌. మ‌హేష్ 25వ చిత్రంగా తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles