బన్నీ సినిమా కోసం కోటి రూపాయల లైబ్రరీ

Sat,September 23, 2017 05:25 PM
బన్నీ సినిమా కోసం కోటి రూపాయల లైబ్రరీ

దువ్వాడ జగన్నాథమ్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే మరో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన వక్కంత వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా, వక్కంతం ఇటీవ‌ల‌ లైబ్రరీకి సంబంధించి కొన్ని కీలక సన్ని వేశాలు చిత్రీకరించార‌ట‌. అయితే ఈ లైబ్రరీ కోసం దాదాపు కోటి రూపాయల ఖర్చుతో భారీ లైబ్రరీ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. 2018, ఏప్రిల్ 27న ఈ సినిమాని విడుదల చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. బన్నీ గెటప్ ఈ మూవీలో చాలా కొత్తగా ఉంటుందని , ఇప్పటికే తన మేకొవర్ కూడా మార్చుకున్నాడని సమాచారం. యాక్షన్ కింగ్ అర్జున్, స్టార్ హీరో శరత్ కుమార్ కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూర్చనున్నారు.అను ఎమ్మాన్యుయేల్ ఇందులో కథా నాయికగా నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే యూనిట్ తరువాతి షెడ్యూల్ షూటింగ్ కోసం ఊటీ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS