అభిమానులతో సల్మాన్ సెల్ఫీ అదుర్స్

Wed,May 17, 2017 05:34 PM
huge response forSalman Khan song launch programme

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ట్యూబ్ లైట్. ఈ చిత్రంలోని రేడియో అనే పాటను దుబాయ్ లో గ్రాండ్ లో విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ చిత్రీకరించారు. రేడియో అనే పాటకి అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా, కమాల్ ఖాన్ మరియు అమిత్ మిశ్రా పాట పాడారు. ప్రీతమ్ చక్రవర్తి చిత్రానికి సంగీతం అందించారు. రేడియో సాంగ్ లాంచ్ కార్యక్రమానికి సల్మాన్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆడిటోరియం సల్మాన్ పేరుతో దద్దరిల్లింది. సాంగ్ లాంచింగ్ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బి టౌన్ లోనే బాయిజాన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనే అభిప్రాయాన్ని దుబాయ్ ఫ్యాన్స్ మార్చారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 25న విడుదల కానుంది#Tubelight #Radio #dubai

A post shared by Tubelight (@tubelightkieid) on


1355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS