అవెంజ‌ర్స్‌లోని పాత్ర‌ల‌కి అదిరిపోయే రెస్పాన్స్‌

Wed,May 15, 2019 08:41 AM

మార్వెల్ సంస్థ నుండి వ‌చ్చిన అవెంజ‌ర్స్ ఫ్రాంచైజీలో ఆరుగురు హీరోల స‌మూహ‌ము ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ర‌క్తి క‌ట్టించాయి. క‌ల్పిత పాత్ర‌లే అయిన‌ప్ప‌టికి నిజ‌మైన పాత్ర‌ల వ‌లే ద‌ర్శ‌కుడు వాటిని మ‌ల‌చాడు. ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థోర్, కేప్టన్ అమెరికా, మరియు యాంట్ మ్యాన్‌ల నట విన్యాసానికి ప్రేక్ష‌కులు క‌ళ్ళు తిప్పుకోలేక‌పోయారు. విచిత్ర హావ‌భావాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచేసిన ఐర‌న్ మ్యాన్ పాత్ర‌లో రాబర్ట్ డౌనీ జూనియర్ న‌టించ‌గా, థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్. హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో. హాక్ ఐగా నటించింది జెరెమి రెన్నెర్. బ్లాక్ విడోగా నటించిన నటి స్కార్లెట్ జొహాన్సన్. కేప్టన్ అమరికా పాత్రను పోషించింది క్రిస్ ఎవాన్స్.


మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌(ఎంసీయూ)కి చెందిన సినిమాలన్నింటిలో ముఖ్యులు ఐర‌న్ మ్యాన్. ఐరన్ మ్యాన్ అస‌లు పేరు టొనీ స్టార్క్ . చాలా ధనవంతుడు. ఇతడు "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్. ఓ ఇనుప క‌వ‌చాన్ని రూపొందించుకొని దాని సాయంతో ఆయ‌న దుష్ట‌శ‌క్తుల‌ని ఎదుర్కొంటాడు. ఆయ‌న పేరుతో ఐర‌న్ మ్యాన్‌, ఐర‌న్ మ్యాన్ 1, ఐర‌న్ మ్యాన్ 2, ఐర‌న్ మ్యాన్ 3 చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటికి ప్రేక్షకాద‌ర‌ణ ల‌భించింది.

మ‌రో ప్ర‌ముఖ పాత్ర పేరు హల్క్. అసలు పేరు డాక్టర్ బ్రూస్ బ్యానర్. ఇతనికి కోపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు. వింత‌జీవిగా మారిన సైంటిస్ట్ పాత్ర ఇది. మామూలుగా బ్రూస్ మనలాగే ఉంటాడు. కానీ కోపమొస్తేనే ఏకంగా ఎడడుగుల మనిషైపోతాడు. ఆకుపచ్చ రంగులోకి మారతాడు. ఎంత దూరమైన సరే గాల్లోకి ఎగిరి వెళ్ళిపోతాడు. అతణ్ని చూసి ప్రజలు భయపడతారు. దాంతో సైన్యం అతణ్ని చంపాలని బాంబులు వేస్తుంది. హల్క్‌ వాళ్ళందరినీ పిండి చేస్తాడు. శత్రువులు తన కోసం హెలికాప్టర్లలో వస్తే, వాటినందుకొని గిరగిరా తిప్పికొడతాడు.

అస‌లు బ్రూస్‌ బానర్‌(హ‌ల్క్‌) అనే పిల్లాడు డాక్టర్‌ బ్రైన్‌బానర్‌ కొడుకు. బ్రూస్‌ని తండ్రి అంతగా ఇష్టపడేవాడు కాదు. అమ్మ మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇలా ఉండగా ఒకరోజు బ్రూస్ నాన్నని ఎవరో చంపేస్తారు. దాంతో అతని అమ్మకి పిచ్చిపడుతుంది. బ్రూస్‌ ఒంటరివాడై పోతాడు. అయినాసరే, బాగా చదివి అణు శాస్త్రవేత్త అవుతాడు. అంతేకాదు, ఒక గామా బాంబుని కనిపెడతాడు. అనుకోకుండా ఆ బాంబు పేలి, గామాకిరణాలు అతని శరీరంలోకి చొచ్చుకొని పోతాయి. దాంతో అతని శరీరం చిత్రమైన మార్పులకు గురై, భారీగా పెరిగిపోయి హల్క్‌ అయిపోతాడు.

కెప్టెన్‌ అమెరికా .. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో ప్ర‌ధానంగా సెట్ చేయ‌బ‌డిన పాత్ర ఇది. బ్రూక్లిన్ నుండి ఒక రోగగ్రస్తుడైన స్టీవ్ రోజర్స్ కథను చెబుతుంది. సైనిక ప్రయోగాల కారణంగా అంతులేని బలాన్ని సంతరించుకుంటాడు. కెప్టెన్ అమెరికాగా రూపాంత‌రం చెందిన ఈ సూప‌ర్ సైనికుడు రెడ్ స్క‌ల్‌ని ఆపేందుకు ఎంత‌గానో కృషి చేస్తాడు. అతను ప్ర‌పంచాన్ని శాసించేందుకు ఉప‌యోగ‌ప‌డే టెసెరాక్ట్ష అనే ఎనర్జీని పొందుతాడు.

కెప్టెన్ మార్వెల్ .. కెప్టెన్ మార్వెల్ పాత్ర‌లో ఆస్కార్ విన్నర్ బ్రీ లార్సన్ టైటిల్ రోల్ పోషిస్తోంది. యాక్షన్ స్టంట్స్, ఆమెలోని కిల్లర్ కాన్ఫిడెన్స్ మార్వెల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్నతనంలో అందరూ హేళన చేసినా తనకంటూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది. పైలెట్‌ కావాలనుకుంటుంది. పైలెట్‌గా ఉండగా యుద్ధంలో ప్రాణాపాయస్థితిలోకి వెళుతుంది. శత్రువులకు చిక్కిన ఆమెకు గ్రహాంతవాసులైన వారు కొన్ని శక్తులతో బతికిస్తారు. దాంతో గతాన్ని కోల్పోతుంది. అయితే గతం తాలూకు జ్ఞాపకాలతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా అది ఆమె వల్ల కాదు. అయితే ఆమెకి కొన్ని విపరీతమైన శక్తులు ఉన్నా వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఆ సమయంలో తన డీఎన్‌ఏ మారిపోయి అనూహ్యమైన శక్తులను వశం చేసుకుంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఆమెకు తన గతం తెలుస్తోంది. అప్పుడు త‌న మిత్రృలెవ‌రు,శ‌త్రువులెవ‌రో తాను తెలుసుకుంటుంది.

బ్లాక్‌ విడో ..మార్వెల్ కామిక్స్ పుస్తకాల నుండి తీసుకోబ‌డ్డ మ‌రో పాత్ర ఇది. ఎడిట‌ర్ స్టాన్‌లీ, స్క్రిప్ట‌ర్ డాన్ రికో, ఆర్టిస్ట్ డాన్ హెక్ ఆ పాత్ర‌ని రూపొందించారు. ఐర‌న్ మ్యాన్ చిత్రంలో ర‌ష్య‌న్ స్పైగా ఈ పాత్రని రూపొందించ‌గా, ఐర‌న్ మ్యాన్‌కి ప్ర‌తినాయ‌కిగా ఈమె పాత్ర ఉంటుంది. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉన్న ఈమె షీల్డ్ అనే స్పై ఏజెన్సీ సంస్థ‌లో ప‌ని చేస్తూ ఉంటుంది. ఎవెంజ‌ర్స్ సూప‌ర్ హీరో టీంలో ఈమె కూడా ఓ స‌భ్యురాలిగా ఉంటుంది.

థోర్.. మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్స్‌లో మ‌రో ముఖ్య పాత్ర థోర్. ఆస్ట్రేలియన్ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ థోర్ పాత్రలో అరడజను కు పైగా సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అబిమానులను సంపాదించుకున్నాడు. థోర్.. అస్గార్డ్ అనే గ్ర‌హానికి యువ‌రాజు. భారీ సుత్తితో దుష్ట శ‌క్తుల‌ని అంతం చేయ‌డం ఇత‌ని హాబీ. ఈ హీరో చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థోర్ పాత్ర కోసం క్రిస్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు. ఒకానొక స‌మ‌యంలో ఇంకోసారి ఆ పాత్ర‌లో న‌టించ‌న‌ని కూడా అన్నాడు. థోర్ పేరుతో మూడు సిరీస్ చిత్రాలు విడుద‌ల‌య్యాయి.

యాంట్ మ్యాన్ .. స్పైడర్ మ్యాన్ , ‘బ్యాట్ మాన్’ , ‘ఐరన్ మ్యాన్’ లా మ‌రో మ‌నిషి ఐర‌న్ మ్యాన్ . చీమ మ‌నిషిగా స‌రికొత్త అవ‌తారంలో ఉండే ఈ మ‌నిషి అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌న ఆకారం మార్చుకోగ‌ల‌డు. ప్ర‌మాదపు స‌మ‌యంలో చీమ‌గా మార‌డం, ఆ వెంట‌నే మాములు మనిషిగా మారి శత్రువుల ఆట‌ప‌ట్టించ‌డం ఈయ‌న ప్ర‌త్యేక‌త‌. పీటన్ రీడ్ దర్శకత్వం వహించిన సినిమాలో ‘యాంట్ మ్యాన్’గా పాల్ రడ్ నటించాడు.

మొత్తానికి ‘మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ (ఎంసియు) సంస్థ నుండి 11ఏళ్ళల్లో 22 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకి రాగా అవి చాలా వినోదాన్ని అందించాయి. కామిక్ కోసం స‌ర‌దాగా ఎన్నో పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేయగా, వాటికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. ప్రపంచంలో ఉన్న సినీ అభిమానుల‌ని ఈ పాత్ర‌లు గొప్ప అనుభూతికి గురి చేశాయి. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఎన్నో పాత్ర‌ల‌ని సృష్టించి వినోదంతో పాటు వివేకం కూడా క‌లిగేలా మేక‌ర్స్ ప‌లు చిత్రాలు చేయ‌డం అభినంద‌నీయం.

1497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles