మెగాస్టార్‌కి 130 అడుగుల భారీ క‌టౌట్‌

Fri,December 14, 2018 09:54 AM

మంచి భావం ఉన్న కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్. మ‌లయాళ మెగాస్టార్ గా అభిమానులతో పిలిపించుకునే ఈ నటుడు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన‌ ఒడియ‌న్ అనే చిత్రంతో నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇదొక ఫాంటసీ మూవీ అని చెబుతున్నారు. ఇందులో మోహన్ లాల్ లుక్ చాలా కొత్తగా ఉంది. చిత్రంలో మోహన్ లాల్ 'ఓడియన్ మాణిక్యన్' అనే పాత్రలో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుండగా ఈ మూవీ నేడు తెలుగు, తమిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించారు. రామ్ దగ్గుబాటి, సంపత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో సూపర్ పవర్స్ కలిగిన పాత్రలో మోహన్ లాల్ నటించారు. నేడు చిత్రం విడుద‌ల కాబోతున్న సంద‌ర్భంగా కేరళలోని త్రిసూర్ జిల్లాలో గల 'రాగం' థియేటర్ ప్రాంగణంలో 130 అడుగుల మోహన్ లాల్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ ఇంత ఎత్తైన కటౌట్ ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

4173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles