ఒక్క సాంగ్ కోసం 150 కార్లు, 2.5 కోట్ల ఖ‌ర్చు

Thu,July 13, 2017 05:26 PM
huge cost for dhanush movie song

2014 లో ర‌ఘువ‌ర‌న్ బీటెక్ మూవీ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ధ‌నుష్ ఇప్పుడు మ‌ళ్లీ అదే మూవీకి కొన‌సాగింపుగా వీఐపీ2 గా వ‌స్తున్నాడు. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో జూలై 28న విడుద‌ల కానుంది.ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అమ‌లా పాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, కాజోల్ కూడా ముఖ్య పాత్ర పోషించింది. పెళ్లి చూపులు ఫేం రీతూ వ‌ర్మ స్పెష‌ల్ రోల్ చేస్తున్న‌ట్టు టాక్. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన వార్త అభిమానుల‌కి షాకింగ్ గా మారింది. ఓ సాంగ్ కోసం 12 స్టేర్స్ బిల్డింగ్ తో పాటు 150 కార్లు కూడా ఉప‌యోగిస్తున్నార‌ట‌. దీనికి దాదాపు 2.5 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెబుతున్నారు. రోప్ షాట్ కొరియోగ్ర‌ఫీతో ఈ సాంగ్ చిత్రీక‌రించ‌నుండ‌గా తొలిసారి సౌత్ లో ఈ ప్ర‌యోగం చేయ‌నున్నార‌ట‌. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌ల విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్స్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచాయి.

6890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles