16 రోజుల్లో 300 కోట్లు కొల్ల‌గొట్టిన సంజు

Sun,July 15, 2018 10:20 AM
huge collections for sanju movie

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో రెండు రోజుల‌లో 50 కోట్లు సాధించిన ఈ చిత్రం 16వ రోజు చేరే స‌రికి 300 కోట్ల మార్కుని అందుకుంది. మూడో రోజు వంద కోట్లు సాధించిన ఈ చిత్రం, ఐదో రోజుకి 150 కోట్లు, ఏడో రోజుకి 200 కోట్లు, ప‌దో రోజుకి 250 కోట్ల వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు టైగ‌ర్ జిందా హై, భ‌జ‌రంగీ బాయిజాన్, పీకే చిత్రాల రికార్డుని కొల్ల‌గొట్టిన సంజు చిత్రం బాహుబ‌లి ది కంక్లూజ‌న్(హిందీలో 500 కోట్లు) రికార్డుని బ్రేక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. బాలీవుడ్ హిట్ చిత్రాలు ప‌ద్మావ‌తి, దంగ‌ల్ చిత్రాలు 300 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500.43 కోట్లు సాధించింది. భారత్‌ వ్యాప్తంగా రూ.378.43 కోట్లు(గ్రాస్‌) సాధించింది అని త‌ర‌ణ్ తెలిపారు.

ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సంజు రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ప‌రేష్ రావ‌ల్‌, మ‌నీషాకోయిరాల, దియా మీర్జా, సోనమ్ కపూర్‌, విక్కీ కౌశల్‌, జిమ్ సర్బ్‌, అనుష్క శర్మలు ముఖ్య పాత్ర‌లు పోషించారు. సంజూ మూవీలో సంజయ్ డ్రగ్స్ కి అలవాటు పడటం, 1993 బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన స‌మ‌యంలో అక్ర‌మ‌ ఆయుధాలని క‌లిగి ఉన్న కార‌ణంగా జైలు శిక్ష అనుభవించడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టడం.. ఇలా అన్ని కోణాలని చూపించారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రణ్ బీర్. జూన్ 29న విడుద‌లైన సంజు చిత్రం రానున్న రోజుల‌లో మ‌రిన్ని వ‌సూళ్లు కలెక్ట్ చేస్తుంద‌ని అంటున్నారు.


2109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles