బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న ‘చిచ్చోరే’

Mon,September 9, 2019 03:25 PM
huge collections creates chichhore

ముంబయి: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘చిచ్చోరే’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినీ కేరీర్‌లోనే ఎం.ఎస్. ధోని తర్వాత తొలి వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

సినీ విశ్లేకుడు తరణ్ ఆదర్శ్ ఈ సనిమాకు సంబంధించిన వీకెండ్ కలెక్షన్స్‌ను ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత శుక్రవారం రిలీజైన ఈ మూవీ మొదటి రోజు 7.32 కోట్లు రాబట్టింది. శనివారం 12.25 కోట్లు, ఆదివారం 16.41 కోట్లతో వీకెండ్‌ను 36 కోట్లతో ముగించిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

1624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles