'ప‌డిప‌డి లేచె మ‌న‌సు' నుండి వీడియో సాంగ్

Tue,December 25, 2018 08:40 AM

శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం ప‌డిప‌డి లేచె మ‌న‌సు. అంద‌మైన రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం గ‌త శుక్రవారం విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా తెర‌కెక్క‌గా ఇందులో మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తాజాగా చిత్రానికి సంబంధించి హృదయం జ‌రిపే అంటూ సాగే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. మీరు ఆ సాంగ్‌పై ఓ లుక్కేయండి.


2321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles