2019 ‘సెక్సీయస్ట్ ఏషియన్ మేల్’ ఎవ‌రో తెలుసా?

Thu,December 5, 2019 11:20 AM

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అమ్మాయిల రాకుమారుడిగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేసుకున్న హృతిక్ చివ‌రిగా సూపర్ 30 , వార్ అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చాడు. సూప‌ర్ 30లో ప్రముఖ గణిత ప్రొఫెస‌ర్‌ ఆనంద్‌ కుమార్ పాత్ర‌లో న‌టించి జీవించాడు. ఇక వార్‌లో టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి యాక్ష‌న్ సీన్స్ లో అద‌ర‌గొట్టాడు. గ‌త ప‌దేళ్ళుగా హృతిక్ రోషన్ అద్భుతమైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నందుకు గాను ‘సెక్సీయస్ట్ ఏషియన్ మేల్ ఆఫ్ 2019’గా ఎంపికయ్యారు హృతిక్ రోషన్. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో హృతిక్ రోషన్ ఈ ఘనత దక్కించుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన ఓట్ల ఆధారంగా నిర్వ‌హించిన స‌ర్వే ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. హృతిక్ త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు, 2017 విన్నర్ షాహిద్ క‌పూర్ నిలిచారు. టీవీ న‌టుడు వివియ‌న్ సేన మూడో స్థానంలో నిల‌వ‌గా, నాలుగో స్థానంలో టైగ‌ర్ ష్రాఫ్‌, బ్రిటీష్ ఏషియ‌న్ పాప్ స్టార్ జ్యాన్ మాలిక్ ఐదో స్థానంలో నిలిచారు.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles