సైకిల్‌పై పాప‌డ్ అమ్ముతున్న స్టార్ హీరో

Wed,February 21, 2018 08:59 AM

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ సైకిల్‌పై పాప‌డ్ అమ్ముతున్నాడు. ఐదు రూపాయ‌లకి పాప‌డ్ అనుకుంటూ రాజ‌స్థాన్‌లోని జైపూర్‌ వీధుల్లో తిరుగుతున్నాడు. ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదులేండి. రీల్ లైఫ్‌లో. చాలా గ్యాప్ త‌ర్వాత ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా సూప‌ర్ 30 అనే సినిమా చేస్తున్నాడు హృతిక్ రోష‌న్‌. సూప‌ర్ 30 స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్ధుల‌ని తీర్చిదిద్దారు ఆనంద్ కుమార్ . పాట్నాలో ఎక‌నామిక‌ల్ బ్యాక్ వ‌ర్డ్ సెక్ష‌న్‌కి చెందిన 30 విద్యార్ధుల‌ని సెల‌క్ట్ చేసి జేఈఈ తోపాటు ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చాడు ఈ ప్ర‌ముఖ ఉపాధ్యాయుడు. ఎంద‌రికో స్పూర్తిని క‌లిగించిన ఆనంద్ కుమార్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం బీ టౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం హృతిక్ పాప‌డ్ అమ్మే వ్య‌క్తిగా మారాడు. రిల‌యన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై వికాస్ బాహ్లీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ డీ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. సినిమా విష‌యంలో హృతిక్ డెడికేష‌న్ చూసి టీం షాక్‌కి గురైంద‌ట‌. ఈ చిత్రంతో హృతిక్ చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా మార‌తాడు అని టీం అంటుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న హృతిక్ లుక్స్ పై మీరు ఓ లుక్కేయండి.

3099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles