త‌న సోద‌రిని శారీరికంగా హృతిక్ హింసిస్తున్నారు : క‌ంగనా సోద‌రి

Wed,June 19, 2019 11:31 AM
Hrithik Roshan Family Physically Assaulting says Rangoli

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్, గాడ్జియ‌స్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. వీరి మ‌ధ్య తలెత్తిన వివాదాలు ఇప్ప‌ట్లో చ‌ల్ల‌బ‌డేలా లేవు. మ‌ధ్య మ‌ధ్య‌లో కంగ‌నా ర‌నౌత్ సోద‌రి రంగోలి అగ్నికి ఆజ్యం పోస్తున్న‌ట్టు అనేక వివాదాల‌ని సృష్టిస్తుండ‌డంతో కంగ‌నా, హృతిక్‌ల మ‌ధ్య వైరం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా కంగ‌నా సోద‌రి రంగోలి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా హృతిక్ త‌న సోద‌రి సునైనాని శారీరికంగా హింసిస్తున్నారంటూ పేర్కొంది.

సునైనాని హృతిక్ కుటుంబీకులు చిత్ర హింస‌లు పెడుతున్నారు. ఆమె ముస్లింకి చెందిన వ్య‌క్తితో ప్రేమ‌లో ఉండ‌గా, అది ఇంట్లో వారికి న‌చ్చ‌లేదు. గ‌త వారం ఓ మ‌హిళా పోలీసుని ఇంటికి పిలిపించి వార్నింగ్ కూడా ఇప్పించారు. ఆ పోలీసు సునైనాపై చేయి కూడా చేసుకుంద‌ట‌. హృతిక్ తండ్రి రాకేష్ రోష‌న్ కూడా సునైనాని కొట్టార‌ట‌. జైలుకి కూడా పంపించాల‌ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నార‌ట‌. సునైనాకి హృతిక్ ఫ్యామిలీ నుండి ఆప‌ద పొంచి ఉంది. కంగ‌నాకి కాల్ చేసి సాయం చేయ‌మ‌ని అడుగుతుంది. ఎలా సాయం చేయాలో కంగ‌నాకి అర్ధం కావ‌డం లేదు. ఈ విష‌యం అంద‌రికి తెలియాల‌నే ఈ విషయాలన్నీ ట్విటర్‌ వేదికగా బయటపెడుతున్నాను. ఎవరినైనా ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్‌ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొంది రంగోలి. ఒక ట్వీట్‌లో కంగ‌నా..సునైన నెంబ‌ర్‌ని బ్లాక్ చేసింద‌ని కూడా పేర్కొంది. అయితే సునైన త‌న ట్విట్ట‌ర్‌లో త‌మ ఫ్యామిలీదే త‌ప్పు అన్న‌ట్టు కంగ‌నాకి త‌న మ‌ద్ద‌తు తెలిపింది. న‌ర‌కంలో ఉన్న‌ట్టుగా ఉందంటూ కూడా పేర్కొంది. మ‌రి దీనిపై హృతిక్ ఫ్యామిలీ ఏమైన స్పందిస్తుందేమో చూడాలి.

4973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles