హృతిక్ వ‌ర్సెస్ టైగ‌ర్‌.. వార్ అదిరింది

Mon,July 15, 2019 05:20 PM
Hrithik Roshan and Tiger Shroffs War film teaser released

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరోలు హృతిక్ రోష‌న్‌.. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన వార్ మూవీ టీజ‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. అత్య‌ద్భుత ఫైటింగ్ స‌న్నివేశాల‌తో వార్ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. బైక్‌లు, హెలికాప్ట‌ర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టిస్తున్నాయి. యాక్ష‌న్ హీరోలు ఇద్ద‌రూ త‌మ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. టీజ‌ర్‌ రిలీజ్ సంద‌ర్భంగా స్టార్స్ ఇద్ద‌రూ ట్విట్ట‌ర్‌లో ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకున్నారు. హృతిక్ నీ స్టంట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి, అవి ఎలా చేయాలో నేను చూపిస్తానంటూ టైగ‌ర్ ష్రాఫ్ ట్వీట్ చేశారు. నేను ఏలిన రాజ్యంలో నువ్వు ఇప్పుడే అడుగుపెట్టావ్ టైగ‌ర్ అంటూ హృతిక్ ఓ ట్వీట్‌తో స‌మాధానం ఇచ్చాడు. వార్ మూవీలో వాణీ క‌పూర్ న‌టిస్తున్న‌ది. సిద్ధార్డ్ ఆనంద్ దీన్ని డైర‌క్ట్ చేస్తున్నారు. య‌స్‌రాజ్ ఫిల్మ్స్‌ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

1232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles