టాలీవుడ్ సెక్స్ రాకెట్.. అమెరికా పోలీసులు ఇలా పట్టుకున్నారు..

Sat,June 16, 2018 11:50 AM

హైదరాబాద్: అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు నిర్మాత కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళ ఆ రాకెట్‌ను నడిపిస్తున్నారు. ఈ ఇద్దర్నీ చికాగో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తామంటూ హీరోయిన్లను తీసుకువెళ్లి.. అక్కడ వాళ్లతో వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ఈ ఉదంతం టాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ కలవరం రేపింది. స్టార్ నైట్స్ పేరుతో యువ తారలను తీసుకువెళ్లి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని తేలింది. నిజానికి ఈ ఆపరేషన్ ఎలా సాగుతోంది అమెరికా పోలీసులు నిగ్గు తేల్చారు. మోడస్ ఆపరెండీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అసలు హీరోయిన్లకు, మోడళ్లు, యాంకర్లకు ఎలా వల వేస్తారు. వాళ్లను ఎలా ఆ ఊబిలోకి లాగేస్తారో పోలీసులు వివరించారు. ఆ నిజాలు నిజానికి టాలీవుడ్‌ను కుదిపేశాయి.

టాలీవుడ్ హీరోయిన్లు, మోడళ్లు, యాంకర్లకు ముందుగా బీ1, బీ2 విజిటర్ వీసాలు ఇస్తారు. ఆ తర్వాత వాళ్లను అమెరికాకు తీసుకెళ్తారు. హీరోయిన్లతో ఒక రాత్రి గడుపుతే.. ఇక ఆ కస్టమర్ల నుంచి వెయ్యి లేదా మూడు వేల డాలర్లు వసూల్ చేస్తారు. వన్ టైమ్ సెక్స్‌కు ఆ రేట్. అయితే 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 29 వరకు మన టాలీవుడ్ నుంచి సుమారు 76 ఎయిర్‌లైన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలియనాస్‌లోని షిల్లర్ పార్క్‌లో ఉన్న కంఫర్ట్ షూట్‌ను వాళ్ల కోసం బుక్ చేశారు. కిషన్, వేబా అన్న పేర్లతో ఆ రూమ్‌లను బుక్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగే ఓ స్టార్ నైట్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఓ బాధితురాలు అమెరికా వచ్చింది. 2017 నవంబర్ 8న ఆమె చికాగో వచ్చింది. అయితే ఈవెంట్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఆమె రావడంతో స్థానిక పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ మీటింగ్ కోసం వచ్చినట్లు ఆమె చెప్పింది. అయితే ఆ సొసైటీని పోలీసులు కలిశారు. కానీ మీటింగ్ ఏమీ లేదంటూ వాళ్లు చెప్పారు. దీంతో పోలీసులు ఈ కేసులో పట్టుబిగించారు. ఆ తర్వాత ఆ హీరోయిన్ షాకింగ్‌ నిజాలను బయటపెట్టింది.

4755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles