న్యూ క‌పుల్‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీస్ విషెస్

Fri,November 16, 2018 12:17 PM
How B Town Wished The Newly Weds

బాలీవుడ్ క్రేజీ క‌పుల్ రణ్‌వీర్ సింగ్- దీపికా ప‌దుకొణేలు నవంబ‌ర్ 14,15 తేదీల‌లో కొంక‌ణీ, సింధు సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, నిన్న సాయంత్రం నూత‌న దంప‌తులు సోష‌ల్ మీడియా ద్వారా వారి పెళ్లి ఫోటోల‌ని విడుద‌ల చేశారు. ఇవి చూసిన అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. కొద్ది గంట‌ల‌లో ఈ ఫోటోల‌కి భారీ లైక్స్ రావ‌డంతో షాక్ అవ్వ‌డం అంద‌రి వంతైంది . ఇట‌లీలో అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన దీప్‌వీర్ పెళ్ళిపై బాలీవుడ్ సెల‌బ్రిటీలు అంద‌రు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. క‌ర‌ణ్ జోహార్‌, అనుష్క శ‌ర్మ‌, సుస్మిత సేన్‌, సోన‌మ్ క‌పూర్ , ప‌రిణితీ చోప్రా, ఆయుష్మాన్ ఖురానా, జెనీలియా, బిపాసా బ‌సు, హుమా ఖురేషి, రాజ్ కుమార్ రావు, కైరా అద్వానీ, విక్కీ కౌశ‌ల్ త‌దిత‌రులు ఈ నూత‌న జంట‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, వారి నూత‌న ప్ర‌యాణం విజ‌య‌వంతంగా సాగాల‌ని కోరారు. ఈ రోజు లేదా రేపు దీప్‌వీర్ జంట ఇండియాకి రానుండ‌గా, ఈ నెల 21న బెంగళూరులోని లీలా ప్యాలస్‌లో తొలిసారి, నవంబర్ 28న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో మరోసారి వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.
971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles