బిగ్ బాస్ హౌస్‌లో ఉప్పొంగిన‌ దేశభక్తి.. మెసేజ్ ఇచ్చిన ఇంటి స‌భ్యులు

Fri,August 16, 2019 08:22 AM
housemates spread a social message on the occasion of Independence Day

బిగ్ బాస్ హౌజ్‌లో ఇండిపెండెన్స్ డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. స‌మాజంకి మంచి అందించాల‌నే ఉద్దేశంతో రెండు స్కిట్స్ చేసిన ఇంటి స‌భ్యులు ఆ త‌ర్వాత భావోద్వేగానికి గుర‌య్యారు. అర్ధ‌రాత్రి ఆడ‌పిల్ల తిర‌గ‌లేని ప‌రిస్థితి ఇప్ప‌టికీ ఉన్న నేప‌థ్యంలో మ‌న‌కి అస‌లైన స్వాతంత్య్రం ఎక్క‌డిది అంటూ ఆవేశంగా మాట్లాడారు. సంద‌డిగా సాగిన 26వ ఎపిసోడ్‌లో మొద‌ట విన‌రా విన‌రా దేశం మ‌న‌దేరా.. అనే దేశ‌భ‌క్తి గీతం ప్లే కావ‌డంతో అంద‌రు ఇంటి స‌భ్యులు ఆ పాట‌ని ఎంజాయ్ చేశారు.

రెండో వారం ఇంటి నుండి వెళ్లిపోయిన జాఫ‌ర్ బ‌ర్త్‌డే ఆగ‌స్ట్ 15న కావ‌డంతో ఆయ‌న‌కి బాబా భాస్క‌ర్, శ్రీముఖి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు అందించారు. ఆ త‌ర్వాత వితికా, పున‌ర్న‌వి, వ‌రుణ్ సందేశ్ మ‌ధ్య కిచెన్‌లో కాసేపు చిన్న గొడ‌వ జ‌రిగింది. నేను కిచెన్ డిపార్ట్‌మెంట్ మారిపోతా అని పున‌ర్న‌వి అంటే అందుకు వ‌రుణ్‌.. నీకు వారం వారం మార‌డం అల‌వాటే కదా.. మారిపో అని అంటాడు. త‌ర్వాత జోక్‌గా అన్నాలే అని చెప్ప‌డంతో ఆ మేట‌ర్‌ అక్క‌డికి కూల్ అయిపోయింది.

పున‌ర్న‌వి మాట‌ల‌ని కాస్త సీరియ‌స్‌గా తీసుకున్న వితికా ..పున‌ర్న‌వి కిచెన్‌లో చాలా ఓవ‌రాక్ష‌న్ చేస్తుంది. కొన్ని సార్లు ఆమె ప్ర‌వ‌ర్త‌న నాకు న‌చ్చ‌డం లేద‌ని తోటి స‌భ్యుల‌తో చ‌ర్చించింది వితికా. ఇక ఆ త‌ర్వాత హిమ‌జ‌.. పున‌ర్న‌వితో నేను ఎంత మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించిన ఆమె నాకు స్పేస్ ఇవ్వ‌డం లేదంటూ శ్రీముఖితో డిస్క‌స్ చేసింది. ఇక శ్రీముఖి.. రాహుల్ వెళితే మొద‌ట సంతోషించేది నేనే. కాని అత‌ను పులిహోర రాజా . అత‌న్నితీయ‌రు. పులిహోర రాజా అనే ట్యాగ్ అత‌న్ని హౌజ్‌లో ఉండేలా చేస్తుంది అని శ్రీముఖి పేర్కొంది.

ఆ త‌ర్వాత బాత్ రూం స‌రిగ్గా ఉంచ‌డం లేద‌ని ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన బాబా భాస్క‌ర్, మ‌హేష్‌ని ఆట‌ప‌ట్టించారు హిమ‌జ‌, శ్రీముఖి. మేము ఏం త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్టు బాబా భాస్క‌ర్ వారి లోపాలు ఎత్తి చూపాడు. మీకు కేటాయించిన లివింగ్ రూంలో ఎంత డ‌స్ట్‌, వెంట్రుకలు ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారంటూ శ్రీముఖి, హిమ‌జ‌ల‌కి క్లాస్ పీకాడు. స‌ర‌దాగా సాగిన సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌నే అందించింది. ఇక బిగ్ బాస్ .. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఇంటి స‌భ్యుల‌కి ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి స‌భ్యులు రెండు టీంలుగా విడిపోయి స‌మాజ శ్రేయ‌స్సు కొర‌కు స్కిట్‌లు ప్ర‌ద‌ర్శించాలి. మీరు ఇచ్చే సందేశం యువ‌త‌తో పాటు మిమ‌ల్ని ప్రేమించేవారికి చేరేలా చూడాలి అన్నారు.

శ్రీముఖి, అలీలు యాంకర్స్‌గా రంగంలోకి దిగ‌గా మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు స్త్రీ పురుష స‌మానత్వంపై చ‌క్క‌ని స్కిట్ ప్ర‌ద‌ర్శించారు. స‌మాజంలో మగ‌వాళ్ళ ఆధిప‌త్యం ఆడ‌వాళ్ల‌పై ఏ విధంగా ఉందో చెప్ప‌డంతో పాటు పెళ్లైన త‌ర్వాత అత్త‌గారి ఇంట్లో ఆడ‌వారి ప‌రిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పారు. ఆడపిల్ల చదువులోనూ తల్లిదండ్రుల పెంపకంలోనూ ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్‌గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది వితికా షెరు. ఇక ఆ త‌రువాత పున‌ర్న‌వి.. ఆడ‌వాళ్ళు ఎందులో త‌క్కువ‌. ఫోన్‌లో కొద్ది సేపు మాట్లాడితే అది తప్పు, క్యారెక్ట‌ర్ లెస్ అంటారు. అదే ఒక అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది సోషలైజింగ్ అంటారు. ఇదేనా అమ్మాయిల‌కి మీరు ఇచ్చే గౌర‌వం అంటూ ఆవేశంగా మాట్లాడింది.

ఆ త‌ర్వాత మ‌రో స్కిట్ చేసిన ఇంటి స‌భ్యులు పుట్టిన దేశాన్ని, క‌న్న త‌ల్లితండ్రుల‌ని వ‌దిలి వెళ్ళే వారికి కౌంట‌ర్ ఇస్తూ మంచి సందేశం కూడా అందించారు. ఆ త‌రువాత భార‌త్ మాత కీ జై నినాదాలు చేశారు. స‌త్యం ప‌లికే హ‌రిశ్చంద్రులం అనే దేశ భ‌క్తి పాట‌కి స్టెప్పులేస్తూ బిగ్ బాస్ హౌజ్‌ని హోరెత్తించారు. మొత్తానికి 26వ ఎపిసోడ్ స‌ర‌దాగా, ఎమోష‌నల్‌గా సాగింది. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయో చూడాలి.

2372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles