క‌ల‌ర్‌ఫుల్ కెప్టెన్‌గా శ్రీముఖి.. ఆనందంలో వితికా, పున్ను

Sat,September 28, 2019 07:44 AM

దాదాపు ప‌దోవారం మొత్తం కెప్టెన్ టాస్క్ ప్ర‌క్రియ‌నే కొన‌సాగ‌గా ఈ సారి ఇంటి కెప్టెన్ బాధ్య‌త‌లు శ్రీముఖి స్వీక‌రించింది. అత్త రాజ్యంలో కోడ‌ళ్ళ పాట్లు అనే టాస్క్ స‌క్సెస్‌ఫుల్‌గా ఆడినందుకు కెప్టెన్ పోటీ దారులుగా ర‌వికృష్ణ‌, శ్రీముఖి,శివ‌జ్యోతి, బాబా భాస్క‌ర్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్ కోసం తలపడేందుకు బిగ్ బాస్ కలర్ ఫుల్ కెప్టెన్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కి సంచాలకులుగా హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న మహేష్ వ్యవహరించారు. టాస్క్ ప్రకారం నలుగురు కెప్టెన్ పోటీదారులకు వివిధ రంగుల కలర్స్ బౌల్స్ ఇచ్చి అందులోని కలర్స్‌ని రెండు చేతులతోనూ పట్టుకుని కింద పడకుండా చూసుకోవాలని, ఎవ‌రైతే లాస్ట్ వ‌ర‌కు బౌల్‌లో ఎక్కువ క‌లర్ ఉంచుకుంటారో వాళ్లే ఇంటికి కెప్టెన్‌ అవుతారని అని చెప్పారు బిగ్ బాస్.


టాస్క్‌లో భాగంగా శ్రీముఖి, శివ‌జ్యోతి, ర‌వికృష్ణ‌, బాబా భాస్క‌ర్‌లు క‌ల‌ర్స్‌తో నిండిన బౌల్స్ ప‌ట్టుకొని ఒక్కొక్క‌రు ఒక్కో మూల‌కి వెళ్లారు. బాబా భాస్క‌ర్‌ది ప‌డగొట్టేందుకు రాహుల్ ప్ర‌య‌త్నం చేయ‌గా, చివ‌రిగా అలీ ఆయ‌న బౌల్‌ని లాగేసుకున్నాడు. దీంతో బాబా టాస్క్ నుండి వైదొలిగాడు. ఆ త‌ర్వాత శివ‌జ్యోతి ఒక చేత్తే బౌల్ ప‌ట్టుకున్న కార‌ణంగా ఆమె కెప్టెన్ టాస్క్ నుండి వైదొలిగింద‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇక శ్రీముఖి, ర‌వికృష్ణ‌ల‌లో ఎవ‌రిని ఈవారం కెప్టెన్‌గా ఎన్నుకోవాల‌నే చ‌ర్చ ఇంటి స‌భ్యుల మ‌ధ్య జ‌ర‌గ‌గా శ్రీముఖికే ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి.

ర‌వికృష్ణ‌కి ఎవ‌రు స‌పోర్ట్ చేయ‌ని కార‌ణంగా స్వ‌యంగా తానే రంగంలోకి దిగి శ్రీముఖి బౌల్ ప‌డ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అంత‌లో అక్క‌డికి వ‌చ్చిన వితికా ర‌వి బౌల్‌లోని క‌ల‌ర్ మొత్తం కింద ప‌డేసింది. దీంతో ఈ వారం ఇంటి కెప్టెన్‌గా శ్రీముఖి బాధ్య‌త‌లు స్వీక‌రించింది. దీంతో వితికా, పున‌ర్న‌వి ఎగిరి గంతులేశారు. ఇక త‌నకి స‌పోర్ట్ చేసిన వారందరికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. త‌న కెప్టెన్సీలో ఎవ‌రెవ‌రు ఏ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాలో తెలియ‌జేసింది శ్రీముఖి.

అంత‌క‌ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ .. బయ‌ట విష‌యాల గురించి కాసేపు చ‌ర్చించాడు. తాను మాత్రం బ‌య‌టి నుండి వ‌చ్చిన వాళ్ళు చెప్పే విష‌యాలు అవి పాజిటివ్ అయిన‌, లేదా నెగెటివ్ అయిన విన‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. అయితే అలీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తాను మాస్క్ వేసుకొని ఉండ‌డంతో అలీ కాదేమో అని చాలా భ‌య‌ప‌డ్డాను అని పేర్కొంది శివజ్యోతి. అంతలో వితికా ..అలీ స్మెల్ చూసే నేను అతను అలీ అని ప‌సిగ‌ట్టేశాను అని అంది. దీంతో నువ్వు పోయిన జ‌న్మ‌లో కుక్క‌వేమో అంటూ పంచ్ వేసింది జ్యోతి. అలీ ఎంట్రీ నాకు కూడా మంచి కిక్ ఇస్తుంది అని వితికా అన‌డంతో బిగ్ బాస్ .. ద‌య‌చేసి ఇది టెలికాస్ట్ చేయండ‌ని శివ‌జ్యోతి కోరింది. మొత్తానికి ప‌దో వారం కెప్టెన్ టాస్క్ ముగియ‌గా, నేడు నాగార్జున స‌మ‌క్షంలో ఇంటి స‌భ్యుల ఆట పాట సందడిగా సాగ‌నుంది.

3835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles