క‌న్నీరు పెట్టుకున్న ఇంటి స‌భ్యులు

Thu,August 9, 2018 08:58 AM
house mates full emotional in episode 60

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఇంటి స‌భ్యులు ఎప్పుడు ఎమోష‌న‌ల్ అవుతారో, ఎప్పుడు ప్రేమ‌ని కురిపిస్తారో, ఎప్పుడు పోట్లాడుకుంటారో అర్ధం కాని పరిస్థితి. ఎపిసోడ్‌ 59లో అంతిమ యుద్ధం అనే టాస్క్‌లో భాగంగా పురుషులు వ‌ర్సెస్ మ‌హిళ‌లు పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ ఇచ్చిన ప‌లు టాస్క్‌ల‌లో గెలిచి ఎవ‌రు ఎక్కువ‌గా కాయిన్స్ పొందుతారో వారే విజేత‌లు అని బిగ్ బాస్ ప్ర‌క‌టించ‌డంతో ఇటు పురుషులు అటు మ‌హిళ‌లు భీక‌రంగా పోరాటప‌టిమ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.


ఎపిసోడ్ 59లో జ‌రిగిన టాస్క్‌ల‌లో మ‌హిళ‌ల‌పై పురుషులు పై చేయి సాధించ‌గా, 60వ ఎపిసోడ్‌లోను పురుషుల హ‌వానే కొన‌సాగింది. ముందుగా క‌బ‌డ్డీ టాస్క్ లో మ‌హిళ‌ల‌పై భారీ మెజార్టీతో పురుషులు గెలిచారు. ఆ త‌ర్వాత స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కీస్ తో గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్‌ల‌ని ఓపెన్ చేసి కాయిన్స్ గెలుచుకోవాల‌నే టాస్క్‌లోను పురుషులే పై చేయి సాధించారు. మ‌హిళ‌ల త‌ర‌పున పూజా పూల్‌లోకి దిగ‌గా, పురుషుల త‌ర‌పున సామ్రాట్ రంగంలోకి దిగాడు. వీరు ఇచ్చిన కీస్‌తో గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్‌ల‌ని గీతా మాధురి, త‌నీష్‌లు ఓపెన్ చేశారు. ఈ రౌండ్‌లోను పురుషులే మ‌హిళల‌పై గెలిచారు.


ఇక అనాదిగా వస్తున్న ఆచారాలను బిగ్ బాస్ హౌస్‌లో చెరిపేసేందుకు వినూత్నంగా కారు టైర్ మార్చే టాస్క్‌ను మహిళలకు ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో మ‌హిళ‌లు ఓడిపోతే ఆ కాయిన్స్ పురుషుల‌కి చెందుతాయ‌ని అన్నారు. కాని ఆ అవ‌కాశం పురుషుల‌కి ఇవ్వ‌లేదు మ‌హిళలు. గేమ్ కోసం రంగంలోకి దిగిన దీప్తి, పూజా,శ్యామ‌ల‌లు బ‌జ‌ర్ మోగే లోగా పంక్చ‌ర్ అయిన టైర్ తొలగించి కొత్త టైరుని అమ‌ర్చారు. దీంతో ఇందులో వీరే విజేత‌లుగా నిలిచారు. ఇక పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువ ఏడుస్తుంటారనేది అనాదిగా వస్తుంది. దీన్ని మార్పు చేసేందుకు బిగ్ బాస్ ఎమోషనల్ టాస్క్ ఇచ్చారు.


ఎమోష‌న‌ల్ టాస్క్‌లో భాగంగా నలుగురు పురుషులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కార్చాలని.. ఈ సమయంలో అందరూ నిశ్శ‌బ్ధంగా ఉండాలని బిగ్ బాస్ నిబంధన పెట్టారు. ఈ టాస్క్‌లో వారిని ప్రేరేపించుకొని ఏడ‌వాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌ ఈ టాస్క్ చేయ‌లేక‌పోతే గోల్డ్ కాయిన్స్ మ‌హిళ‌ల‌కి ల‌భిస్తాయ‌ని బిగ్ బాస్ తెలిపారు. ఇక టాస్క్‌లో భాగంగా కౌశల్, సామ్రాట్, గణేష్, రోల్ రైడాలు తమ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ను గుర్తు చేసుకుని నిజంగానే ఏడ్చేశారు. టాస్క్ ప్రారంభంలో సరదాగా గేమ్ కోసమే ఏడుస్తున్నారని అందరూ భావించినా.. తరువాత వాళ్ల ఎమోషన్ చూసి మిగ‌తా ఇంటి స‌భ్య‌లే కాక ప్రేక్షకులకి కూడా క‌న్నీళ్ళు కార్చారు. కాని బాబు బోగినేని మాత్రం నవ్వ‌కుండా ఉండలేకపోయారు.

అయితే టాస్క్ పూర్త‌యిన త‌ర్వాత ఎవ‌రెవ‌రు ఏ ఏ సంద‌ర్భాల‌ని ఊహించుకొని ఏడ్చారో వివ‌రించారు. ముందుగా రోల్ రైడా త‌ను ర్యాప‌ర్‌గా ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో ప‌డ్డ క‌ష్టాలు, అనుభ‌వించిన బాధ‌లు త‌ల‌చుకోని క‌న్నీటి పర్యంతం అయ్యారు. ఇక కౌశ‌ల్ వివరిస్తూ.. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చ‌నిపోయిన‌ప్పుడు ఎంతో ఏడ్చాను. కాల్చే స‌మ‌యంలో ఆమె కాలికి ఉన్న మెట్టెని తీసుకొని నాతో జాగ్ర‌త్త‌గా ఉంచుకున్నాను. ఆ సంద‌ర్భం గుర్తు వ‌స్తే నా కంట క‌న్నీళ్ళు ఆగ‌వు. నా తల్లి చ‌నిపోయిన త‌ర్వాత ఆమె గుర్తుగా నా కూతురుకి మా అమ్మ పేరే పెట్టుకున్నాను. జీవితంలో త‌ల్లి లోటు ఎవరు పూడ్చ‌లేరు. వారిని అశ్ర‌ద్ధ చేయ‌వ‌ద్దు అని అన్నాడు.

గ‌ణేష్ త‌ను జాబ్ కోసం ప్ర‌యత్నించిన రోజుల‌ని త‌ల‌చుకుంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. 8 వేల కోసం 8 నెలల పాటు రోడ్లు మీద తిరిగా.. బీటెక్ కష్టం మీద పూర్తి చేసి హైదరాబాద్ వచ్చినా ఎవరూ జాబ్ ఇవ్వలేదు. కనీసం 10 వేలు సంపాదించలేని పరిస్థితి నాది. చాలా వరకూ రోడ్లు మీద గడిపా. కాని నటించాలి. ఆర్జే అవ్వాలి అన్న గోల్‌ని మాత్రం వదల్లేదు. మీరు కూడా మీ గోల్‌ని వదలొద్దు’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక నా పేరెంట్స్‌ నేను చాలా అశ్రద్ధ చేశా. వాళ్లు చెప్పింది ఏది విన‌లేదు మా డాడీకి బ్రెయిన్ స్టోక్ వచ్చిన సందర్భంలో వాళ్లి విలువ ఏంటో తెలిసింది. హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసిన త‌ర్వాత డాక్టర్ ఏం చెప్తారో అని ఎదురు చూసిన క్షణాలు గుర్తు చేసుకుంటే నరకంలా అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్స్‌ నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ సామ్రాట్ ఎమోషన్ అయ్యారు.

ఇక గోల్డ్ కాయిన్స్ కోసం ఇటు పురుషులు అటు మ‌హిళ‌ల మ‌ధ్య వాడి వేడి చ‌ర్చ‌లు జ‌రిగాయి. స‌రైన గేమ్ ఆడ‌డం లేద‌ని త‌నీష్ చెబుతుంటే, మీకైతే ఒక‌రూల్ మా కైతే ఒక రూలా అంటూ మ‌హిళ‌లు చెబుతున్నారు. ఏదేమైన 60వ ఎపిసోడ్ చివ‌ర‌లో జ‌రిగిన హాట్ హాట్ డిస్క‌ష‌న్స్‌తో బిగ్ బాస్ హౌజ్ వేడెక్కింది. మ‌రి 61వ ఎపిసోడ్‌లో ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే కొన్ని గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

5234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles