బిగ్ బాస్ ట్విస్ట్‌.. నోరెళ్ళ‌పెట్టిన ఆడియ‌న్స్

Sun,September 22, 2019 06:54 AM

బిగ్ బిస్ సీజ‌న్ 3 స‌క్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకునేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం ఇంట్లో ప‌ది మంది స‌భ్యులు ఉండ‌గా, నామినేష‌న్‌లో రాహుల్‌, హిమ‌జ‌, మ‌హేష్ ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల‌లో చాలా ఉంది. నిన్న శనివారం కావ‌డంతో నాగ్ ఎంట్రీ దాంతో పాటు ఒక‌రు సేఫ్ కావ‌డం.. గ‌త కొన్ని వారాలుగా ఇలానే జ‌రుగుతూ వ‌స్తుంది. అయితే ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ అని నాగార్జున‌ అన‌డంతో ప్ర‌తి ఒక్కరు షాక్ అయ్యారు. ఆ ఇద్ద‌రు ఎవ‌రా అని అంచ‌నాలు వేయ‌డం మొద‌లు పెట్టారు. కాని అంత‌లోనే నాగ్ ఇచ్చిన షాక్‌కి ప్రేక్ష‌కులు నోరెళ్ళ‌పెట్టారు.


ఎపిసోడ్ 63లో శుక్ర‌వారం జ‌రిగిన కొన్ని స‌న్నివేశాల‌ని చూపించిన నాగ్ ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో సరదాగా ముచ్చ‌టించారు. బాబా త‌న గెడ్డం తీసేయ‌డంతో నాగ్ గెడ్డం పెట్టుకొని ద‌ర్శ‌న‌మిచ్చారు. వారు చేసిన టాస్క్‌ల విష‌యంపై కాసేపు చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ఒక్కో ఇంటి స‌భ్యుడికి త‌మ ఫ్యామిలీ మెంబ‌ర్ ఎదురుగా ఉన్న‌ట్టు ఊహించుకొని ఏం చెప్పాల‌నుకున్నారో చెప్పండ‌ని ఓ ఛాన్స్ ఇచ్చాడు నాగ్‌. దీంతో ఒక్కొక్క‌రు త‌మ ఆత్మీయులు ఎదురుగా ఉన్న‌ట్టు ఊహించుకొని ఎమోష‌న‌ల్ అవ‌డంతో పాటు వారికి చెప్పాల‌నుకున్న‌వి చెప్పారు.

ఇక ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ అని నాగ్ చెప్ప‌డంతో ఇంటి స‌భ్యులు షాక్ అయ్యారు. ముందుగా త‌న చేతిలో ఉన్న ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్ తీసి ఈ వారం రాహుల్ ఎలిమినేష‌న్ అవుతున్నాడంటూ ప్ర‌క‌టించారు నాగ్‌. దీంతో హౌజ్ అంతా నిశ్శ‌బ్ధం. అంద‌రు కాస్త బాధ‌లో ఉండ‌గా, రాహుల్ మాత్రం జాలీగానే క‌నిపించాడు. అదే జోష్‌తో స్టేజ్‌పైకి వ‌చ్చాడు. ఇక ఇంటి స‌భ్యుల‌కి ప‌లు సూచ‌న‌లు చేస్తూ వారితో కొద్ది సేపు మాట్లాడిన రాహుల్ ఓ గేమ్ ఆడాడు. ఇంట్లో ఉన్న స‌భ్యుల‌లో రిలేష‌న్ షిప్‌, హ్యూమానిటీ, ఫ్రెండ్షిప్‌కి గాను మార్క్స్ ఇచ్చాడు. వ‌రుణ్‌కి 30కి 30 మార్కులు వేశాడు.

ఇక గేమ్ అయిపోయిన త‌ర్వాత ఇంట్లో వాళ్లంద‌రికి బైబై చెప్పిన రాహుల్‌కి నాగ్ పెద్ద షాకే ఇచ్చాడు. ఇది ఫేక్ ఎలిమినేష‌న్‌. నువ్వు ఏ దారి నుండి వ‌చ్చావో అదే ద్వారం నుండి ఇంట్లోకి వెళ్లొచ్చు. మిగ‌తావ‌న్నీ బిగ్ బాస్ చెబుతారు అనే స‌రికి ఇటు రాహుల్ అటు ప్రేక్ష‌కులు నోరెళ్ల‌పెట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఎవ‌రు ఊహించ‌క‌పోవ‌డంతో షో కాస్త ర‌క్తి క‌ట్టిందనే చెప్ప‌వ‌చ్చు. అంత‌క‌ముందు రాహుల్ ఎలిమినేట్ అయ్యాడ‌ని తెగ ఫీల‌యింది పున‌ర్న‌వి. అస్స‌లు ఊహించ‌లేదు. ఇక నేను ఎవ‌రిని తిట్టాలి అంటూ కన్నీరు పెట్టుకుంది. మొత్తానికి బిగ్ బాస్ ట్విస్ట్ అదిరింద‌నే చెప్పాలి.. ఈ రోజు ఎలిమినేష‌న్ ఉండ‌గా హిమ‌జ ఎలిమినేట్ అవుతుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో ?

25093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles