హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్ చేతి గ‌డియారం..!

Tue,August 20, 2019 09:01 AM
hot discussion on prabhas watch

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌డంని పొందిన ప్ర‌భాస్ ఆగ‌స్ట్ 30న సాహో చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు ప‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల రామోజీ ఫిలిం సిటీలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా ఈ కార్య‌క్ర‌మానికి ప్రభాస్, రాజ‌మౌళి, వివి వినాయ‌క్, అల్లు అరవింద్, శ్ర‌ద్ధా క‌పూర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో కెమెరా ఎక్కువ‌గా ప్ర‌భాస్‌పైనే ఫోక‌స్ పెట్టింది. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్ ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌కి కొత్త‌గా అనిపించాయి. ఇక ఆయ‌న పెట్టుకున్న చేతి గ‌డియారం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ వాచ్ గురించి ఆరాలు తీయ‌గా అది ‘హబ్లట్’ కాగా.. ఆ వాచ్ ధర రూ. లక్షల పైమాటే ఉంటుందని అంచనా. హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ తరహా వాచ్‌లను ధరిస్తారు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు రూ. 15 లక్షల నుండి రూ. కోటి వరకూ ధర పలుకుతున్నాయి. మ‌రి నేష‌న‌ల్ స్టార్ డం సంపాదించిన హీరో ఆ మాత్రం మెయింటైన్ చేయ‌క‌పోతే ఎలా అంటూ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

5889
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles