బాద్‌షాహో 'హోషియార్ రెహ్న' వీడియో సాంగ్ విడుద‌ల‌

Thu,August 24, 2017 03:07 PM

మిలాన్ లుథ్రియా దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్, ఇమ్రాన్ హష్మీ, విద్యుత్ జాంవాల్, ఇలియానా ఇషా గుప్తా లుక్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలుగా తెర‌కెక్కిన చిత్రం బాద్‌షాహో. 1975 ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ మూవీకి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఆ మ‌ధ్య చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసి అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచిన మేకర్స్ తాజాగా హోషియార్ రెహ‌నా అనే సాంగ్ విడుద‌ల చేశారు . అజయ్ దేవ్ గణ్, ఇమ్రాన్ హష్మీ రాజ‌స్థానీ గెట‌ప్‌లో వెళ్ళి అక్ర‌మ ఆయుధాలు తీసుకొని తేవ‌డం, వారిని పోలీసులు ఫాలో అవ్వ‌డం చూస్తుంటే ఈ మూవీ మంచి యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా అల‌రిస్తుంద‌ని అంటున్నారు. తాజాగా విడుద‌లైన సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.


1326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles