హ‌నీ ఈజ్ ది బెస్ట్ అంటున్న వ‌రుణ్ తేజ్

Sun,December 30, 2018 07:11 AM

ఇటీవ‌ల అంత‌రిక్షం అనే చిత్రంతో అల‌రించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ సంక్రాంతికి ఎఫ్‌2( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల్టీ స్టార‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. చిత్రంలో వ‌రుణ్ , వెంకీలు తోడ‌ళ్ళుగా క‌నిపించ‌నున్నారు. జ‌న‌వ‌రి 12న రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగవంతం చేశారు. లిరిక‌ల్ సాంగ్స్‌తో పాటు వీడియో సాంగ్స్‌ని విడుద‌ల చేస్తూ మూవీపై అంచ‌నాలు పెంచుతున్నారు. తాజాగా హ‌నీ ఈజ్ ది బెస్ట్ అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. వ‌రుణ్ తేజ్‌, మెహ‌రీన్‌ల‌పై చిత్రీక‌రించిన ఈ సాంగ్ అభిమానులని అల‌రిస్తుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌లో శిరీష్, లక్షణ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చగా.. హరి హరసుదర్ పాడారు. శ్రీమణి సాహిత్యం అందించారు.

1980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles