పోలీసుల ముందు లొంగిపోయిన ప్రొడ్యూసర్

Fri,May 25, 2018 05:27 PM
Hollywood Producer Harvey Weinstein surrenders before New York police

న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 66 ఏళ్ల ఈ హాలీవుడ్ మొగుల్ తమను రేప్ చేశాడని, లైంగికంగా వేధించాడని పదుల సంఖ్యలో హీరోయిన్లు ఫిర్యాదు చేశారు. అయితే హీరోయిన్లతో పరస్పర అంగీకారం లేకుండా తానెప్పుడూ సెక్స్‌లో పాల్గొనలేదని అతను చెబుతూ వచ్చాడు.

హీరోయిన్ల ఆరోపణల పర్వం ప్రపంచవ్యాప్తంగా మీటూ ప్రచారానికి తెర తీసిన విషయం తెలిసిందే. నటి లూసియా ఇవాన్స్ చేసిన ఆరోపణలపై పోలీసులు వైన్‌స్టీన్‌పై కేసు నమోదు చేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో న్యూయార్కర్‌లో వైన్‌స్టీన్ వేధింపుల గురించి సవివరంగా ఓ ఆర్టికల్ రాసింది. ఇతర హీరోయిన్లు చేసిన ఆరోపణల ఆధారంగా కూడా అతనిపై కేసులు నమోదు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

తనను రేప్ చేశాడని నటి పాజ్ డీ లా హుయెర్టా చేసిన ఆరోపణపై న్యూయార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూసర్ అలెగ్జాండ్రా కనోసా కూడా న్యూయార్క్‌లో కోర్టులో కేసు వేసింది. ఐదేళ్లుగా వైన్‌స్టీన్ తనను రేప్ చేశాడని, లైంగికంగా వేధించాడని, తిట్టాడని ఆ పిటిషన్‌లో చెప్పింది. మాన్‌హాటన్ క్రిమినల్ కోర్టులో వైన్‌స్టీన్‌ను హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.

2684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles