ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ స‌ర‌స‌న అమెరికన్ బ్యూటీ ..!

Tue,July 23, 2019 11:11 AM
Hollywood Beauty Under Consideration For NTR In RRR

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్ర‌లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో క‌నిపించనున్నాడు. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో క‌థానాయిక‌లుగా అలియా భ‌ట్, డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నాడు జ‌క్క‌న్న‌. అయితే ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము.. ’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కొద్ది రోజుల క్రితం త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. దీంతో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై ప‌లు ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం అమెరిక‌న్ న‌టి ఎమ్మా రోబ‌ర్ట్స్‌ని ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుద‌ల చేయ‌నున్నారు.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles