ఆర్ఎక్స్ 100 హీరో తాజా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,May 9, 2019 11:27 AM
Hippi Movie Trailer released

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హిప్పీ అనే చిత్రంతో త‌మిళ చిత్ర సీమ‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. బైలింగ్యువ‌ల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 7న విడుద‌ల కానుంది. కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని టిఎన్‌ కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు . ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంకి సంబంధించి తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల‌ మేక‌ర్స్. ఇందులో కార్తికేయ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మవుతుంది. రొమాంటిక్ స‌న్నివేశాలు కూడా ఎక్కువ‌గానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. జేడీ చ‌క్ర‌వ‌ర్తి చిత్రంలో కీ రోల్ పోషించారు. ఆయ‌న పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌. నివాస్ ప్రసన్న అందించిన స్వరాలు కూడా సినిమాకి మేజ‌ర్ ప్ల‌స్ అవుతుంద‌ని టీం అంటుంది. ఈ చిత్రం కార్తికేయ కెరియ‌ర్‌కి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర బృందం చెబుతుంది. మ‌రోవైపు కార్తికేయ గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు గుణ 369 అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న చిత్రంలో న‌టించ‌నున్నాడు. అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

1246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles