జూన్‌లో ఆర్ఎక్స్ 100 హీరో మూవీ విడుద‌ల‌

Wed,April 17, 2019 10:51 AM
Hippi Movie release date fixed

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఫుల్ పాపుల‌ర్ అయిన స్టార్ కార్తికేయ‌. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం హిప్పీ. కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని టిఎన్‌ కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ సినిమాలో దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు . ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు మేక‌ర్స్. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. జేడీ చ‌క్ర‌వ‌ర్తి చిత్రంలో కీ రోల్ పోషించారు. ఆయ‌న పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌. నివాస్ ప్రసన్న అందించిన స్వరాలు కూడా సినిమాకి మేజ‌ర్ ప్ల‌స్ అవుతుంద‌ని టీం అంటుంది. ఈ చిత్రం కార్తికేయ కెరియ‌ర్‌కి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర బృందం చెబుతుంది.1326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles