ఆర్ఎక్స్ 100 హీరో త‌ర్వాతి మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Fri,September 21, 2018 11:02 AM
hippi first look released

త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా ప్రేమ‌లో విఫ‌ల‌మైన హీరో పాత్ర‌లో కార్తికేయ‌, ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేసే పాత్ర‌లో పాయ‌ల్ రాజ్ అద్భుతంగా న‌టించారు. వీరి న‌ట‌న‌కి సినీ ప్రేక్ష‌క‌లోకం కాస్త థ్రిల్‌గా ఫీలైంది. ఒక్క హిట్ తోనే చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి, హీరో కార్తికేయ‌కి పెద్ద బేన‌ర్ నుండి భారీ ఆఫర్స్ వ‌స్తున్నాయి. అజ‌య్ భూప‌తి త్వ‌ర‌లో నితిన్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి

ఈ రోజు కార్తికేయ బ‌ర్త్‌డే కావడంతో ఆయ‌న త‌ర్వాతి చిత్రానికి హిప్పీ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ విడుద‌ల చేసి, ఈ సినిమాని ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ థాను నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. త‌మిళం, తెలుగులో తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ బాక్స‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈచిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.

2478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles