హిందీ అర్జున్ రెడ్డి ఎప్పుడొస్తున్నాడో తెలుసా..!

Wed,August 1, 2018 10:39 AM
hindi version released on june

సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. భారీ ఆర్భాటాలు, ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండా కేవ‌లం వివాదాల న‌డుమ విడుద‌లై భారీ విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర ప్ర‌భంజ‌నం సృష్టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ఇందులో ప్ర‌ధాన పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలో రీమేక్ అవుతుంది. వ‌ర్మ అనే టైటిల్‌తో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు త‌మిళ ద‌ర్శ‌కుడు బాల‌. ఇక హిందీలోను ఈ సినిమా రీమేక్ చేస్తున్న విష‌యం విదిత‌మే. విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌కి హిందీలో ప‌లు స్టార్స్‌ని ప‌రిశీలించిన యూనిట్ చివ‌రికి షాహిద్ క‌పూర్‌ని ఓకే చేసింది. ఆగష్టు మొదటి వారంలో హిందీ అర్జున్ రెడ్డి చిత్రం చిత్రీకరణ మొదలవ్వనుంది. ఇక వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెలుగులో తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి హిందీ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించ‌నున్నాడు. తొలి సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డికి రెండో సినిమాగా బాలీవుడ్ చిత్రం రావ‌డం అదృష్ట‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి తెలుగు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి సందీప్ రెడ్డి ఎలాంటి విజ‌యం సాధిస్తాడో చూడాలి.

2221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles