అలీ కాళ్ళ‌పై ప‌డ్డ హిమ‌జ‌.. శ్రీముఖి వ‌ల‌న గాయ‌ప‌డ్డ ర‌వి

Thu,August 8, 2019 08:33 AM
Himaja refuses to obey the rules, ali fire on her

బిగ్ బాస్ సీజ‌న్ 3 మూడోవారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ దొంగ‌లున్నారు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా తికమకపురం ఊరి పెద్దగా వరుణ్‌ సందేశ్‌,తమన్నాలు ఉండ‌గా .. ఊరిలో ఓ జంటగా అలీ , పున‌ర్న‌వి.. అన్న‌ద‌మ్ములుగా రాహుల్ ,మ‌హేష్‌.. అక్క చెల్లెళ్లుగా రోహిణి, వితిక‌ పని కోసం ఎదురు చూసే లాయర్‌గా హిమజగా ఉన్నారు. బద్దకస్తుడైన పోలీస్‌ ఆఫీసర్‌ బాబా భాస్కర్‌.. స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌గా శివజ్యోతి . ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకుని జైల్లో వేస్తున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 3లో ప్ర‌తి రోజు హౌజ్‌లో వాడివేడి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన టాస్క్ ఫిజిక‌ల్‌కి సంబంధించి కావ‌డంతో హౌజ్‌మేట్స్ ర‌చ్చ‌తో హౌజ్ మరింత వేడెక్కింది. నీళ్ళు తాగితే వంద రూపాయ‌లు ఇవ్వాల‌ని అలీ.. హిమ‌జ‌కి చెప్ప‌డంతో ఆమె ఇవ్వ‌కుండానే నీళ్ళు తాగేసింది. వాట‌ర్ అనేది ఊరిలో ఫ్రీగా ల‌భిస్తుంది. దానికి మ‌నీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పింది. రెండో సారి కూడా హిమ‌జ నీళ్లు తాగే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆమెని అడ్డుకొని ఆమె ప్యాంట్ జేబులో వంద రూపాయ‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు అలీ. దీంతో ఆమె త‌న కాళ్ల‌తో అలీ మొహంపై రెండు సార్లు త‌న్నింది. దీంతో రచ్చ స్టార్ట్ అయింది

నువ్వు నా ప్యాంట్ జేబులో చేయి ఎందుకు పెడ‌తావు.. పిచ్చి వేషాలు వేస్తే మొహం ప‌గిలిపోతుంద‌ని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింది హిమ‌జ‌. నువ్వు వాట‌ర్ తాగి డ‌బ్బులు ఎందుకు ఇవ్వ‌డం లేదు. మొహం మీద అలా త‌న్న‌డం క‌రెక్టా అని అలీతో పాటు ప‌లువురు ఇంటి స‌భ్యులు ఆమెని నిల‌దీశారు. దీంతో హిమ‌జ‌.. అలీకి సారి చెప్పింది. అయిన‌ప్ప‌టికి ఆయ‌న శాంతించ‌క‌పోవ‌డంతో అలీ కాళ్ళ‌పై ప‌డి క్ష‌మాప‌ణ‌లు కోరింది హిమ‌జ‌. నువ్ కాళ్లపై పడి సింపథీ చూపించడం కాదు.. నేను నిన్ను కాళ్లపై పడమన్నానా? జ‌స్ట్ సారీ కోరాను అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో హిమజ.. బాత్రూమ్‌కి వెళ్లి మరీ బోరున ఏడ్చింది.

హిమ‌జ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా అలీ మాట‌లు అన‌డంతో శ్రీముఖి, త‌మ‌న్నా, అషూలు అలీదే త‌ప్పని చ‌ర్చ జ‌రిపారు. ఇంత‌లో త‌మ‌న్నా లివింగ్ ఏరియాలో ఉన్న అలీపై గ‌రం అయింది. ఆడపిల్ల‌పై నీ ప్ర‌తాపామా అంటూ కోపాన్ని వెళ్ళ‌గ‌క్కింది. అలీ డైరెక్ట్‌గా హిమ‌జ‌తోనే మాట్లాడ‌దామ‌ని గార్డెన్ ఏరియాలోకి రాగా అక్క‌డ కూడా త‌మ‌న్నా, అలీ మ‌ధ్య కొద్ది సేపు చ‌ర్చ జ‌రిగింది. ఇంత‌లో హిమ‌జ నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ అన్నావు, ఏం జ‌రిగిందో చెప్పు . నువ్వు ఏదో మాట్లాడితే అది జ‌నాల‌లోకి నెగెటివ్‌గా వెళుతుంద‌ని హిమ‌జ పేర్కొంది. కొద్ది సేపు డిస్క‌ష‌న్ జ‌రిగిన త‌ర్వాత హిమ‌జ, అలీ జ‌రిగిన విష‌యాన్ని చ‌ర్చించుకొని కూల్ అయ్యారు.

కెప్టెన్ టాస్క్‌లో దొంగ‌లుగా ఉన్న శ్రీముఖి, అషూ, ర‌విలు నిధిని దొంగిలించేందుకు అనేక ప‌థ‌కాలు వేశారు. ర‌వి, అషూలు కొద్ది సేపు జైలులో ఉండ‌డంతో శ్రీముఖి మొత్తం బాధ్య‌త‌ని తీసుకొంది. వ‌రుణ్‌ని మాట‌ల‌లో పెట్టి ట్రంక్ పెట్టె ద‌గ్గ‌ర‌కి తీసుకొచ్చి ఆయ‌న జేబులో ఉన్న డ‌బ్బుని బాక్స్‌లో వేసింది. దీంతో ఆమె సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ఇక పోలీసుల‌కి కొద్ది పాటి లంచం ఇచ్చి అషూ బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఇద్ద‌రు క‌లిసి నిధిని దొంగిలించేందుకు ప‌లు ప‌థ‌కాలు వేశారు. ప‌ర్స‌న‌ల్ ఎటాక్ చేస్తే నిధి ద‌క్కుతుంద‌ని మ‌హేష్ స‌ల‌హా ఇవ్వ‌డంతో ర‌విని బ‌య‌ట‌కి తీసుకొచ్చి శ్రీముఖి, అషూలు నిధి అద్దాల‌ని ప‌గ‌ల‌గొట్టాల‌ని డిసైడ్ అయ్యారు.

ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం డంబెల్‌తో నిది ద‌గ్గ‌ర‌కి వెళ్లిన శ్రీ ముఖి .. నిధి చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతను చేతితో అద్దాలను పగలగొట్టాడు. దీంతో అతని చేతికి బ‌ల‌మైన గాయం కావ‌డంతో పాటు రక్తం ధార‌ళంగా పారింది. వెంట‌నే అత‌నిని మెడిక‌ల్ రూంలోకి తీసుకెళ్లి చికిత్స అందించారు వైద్యులు.

శ్రీముఖి త‌ప్పుడు ఆలోచ‌న‌తోనే ర‌వికి గాయ‌మైంద‌ని వితికా, రాహుల్‌లు ఆమెపై ఫైర్ అయ్యారు. రోహిణి ... శ్రీముఖికి స‌పోర్ట్ చేసి మాట్లాడుతున్న‌ప్ప‌టికి త‌ప్పంతా శ్రీముఖిదే అని వారు గ‌ట్టిగా వాదించారు. నిధికి సంబంధించిన విలువైన వ‌స్తువుల‌న్ని వ‌రుణ్ సోఫాలో ప‌డేశాడు. అవ‌న్ని ర‌వి కృష్ణ‌కే ఇవ్వాల‌ని కొంద‌రు అన్నారు. మ‌రి ఇంత‌లోనే ఎపిసోడ్ 18కి ఎండ్ కార్డ్ ప‌డ‌డంతో కెప్టెన్ ఎవ‌రు అవుతారు అనే దానిపై ఇంకా స‌స్పెన్స్ నెల‌కొని ఉంది. నేటి ఎపిసోడ్‌లో ర‌వి కృష్ణ గాయంపై ఇంకా ఎలాంటి డిస్క‌ష‌న్స్ జ‌రుగుతాయో, కెప్టెన్‌గా ఎవ‌రు ఎంపిక అవుతారో చూడాలి.

9724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles