ఇంట్లో నానా ర‌చ్చ చేసిన హిమ‌జ‌.. షాక్‌లో ఇంటి స‌భ్యులు

Sat,August 24, 2019 07:50 AM
Himaja goes berserk over Baba Bhaskars attitude

బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎపిసోడ్ 34లో బిగ్ బాస్ పున‌ర్న‌వి, శ్రీముఖిల‌ని కన్ఫెష‌న్ రూంలోకి పిలిచి వారి వెనుకు మిగ‌తా వ్య‌క్తులు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో ద్వారా చూపించారు. ముందుగా పున‌ర్న‌విని పిలిచిన బిగ్ బాస్ ..వితికా, వ‌రుణ్‌,రాహుల్‌లు పున‌ర్న‌వి గురించి మాట్లాడిన ముచ్చ‌ట‌ని చూపించారు. ఇది చూసి బ‌య‌ట‌కి వ‌చ్చిన పున‌ర్న‌వి తెగ ఫీల్ అవుతూ అటూ ఇటూ తిరిగింది. ఇక ఆ త‌ర్వాత శ్రీముఖిని క‌న్ఫెష‌న్ రూంలోకి పిల‌వ‌గా, ఆమెకి .. పునర్నవి, రాహుల్, వితికాలు ఎలా గుసగుసలాడారో వీడియో ప్లే చేసి చూపించారు. ఈ వీడియో చూసిన శ్రీముఖి చాలా ఫీలైంది. అలీకి బాబా భాస్క‌ర్ ఎమోష‌న‌ల్ వీడియో చూపించారు. అది చూసిన అలీ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. త‌న వ‌ల‌న మీరు ఏడ్చినందుకు బాబాకి సారీ చెప్పాడు అలీ.

ఇక హిమ‌జ సీక్రెట్ టాస్క్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ టాస్క్‌లో నువ్వు ఎవ‌రిని మ‌న‌శ్శాంతిగా ఉంచ‌కూడ‌దు, ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్‌ని చెడ‌గొట్టాలి. ఇలా చేస్తే నీకు ఓ ఇమ్యునిటీ వ‌స్తుంది అని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో రంగంలోకి దిగిన హిమ‌జ‌.. బాబా భాస్క‌ర్ అన్న ఓ మాట‌కి ప్లేట్ ఎత్తేసింది. ఎగ్‌ట్రేలో ఉన్న ఎగ్స్ అన్ని నేల‌కేసి కొట్టింది. హిమ‌జ ప్ర‌వ‌ర్త‌న చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. అస‌లు ఏం జ‌రిగింది అని ఇంటి స‌భ్యులు అడిగే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి స‌రైన స‌మాధానం ఇవ్వ‌కుండా చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించింది.

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ స‌మ‌యంలో దానిని అడ్డుకునేందుకు హిమ‌జ చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. కాని ఆమె ప‌ప్పులు ఏవి ఉడ‌క‌క‌పోవ‌డంతో సీక్రెట్ టాస్క్‌లో హిమ‌జ విఫ‌లం అయింద‌ని బిగ్ బాస్ తెలిపారు. సీక్రెట్ టాస్క్ స‌రిగి చేయ‌ని కార‌ణంగా ఇమ్యునిటీ కూడా కోల్పోయావ‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ బ‌ర్త్ డే కావడంతో బిగ్ బాస్ కేక్ పంపించారు. కేక్ క‌ట్ చేసిన రాహుల్‌కి అంద‌రు కేక్ తినిపించి బ‌ర్త్‌డేని స‌ర‌దాగా సెల‌బ్రేట్ చేశారు. ఇక ఈ రోజు నాగార్జున ఎంట్రీ ఉండ‌డ‌నుండ‌డంతో కార్య‌క్ర‌మం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నుంది. ఏడుగురి కంటెస్టెంట్‌లో ఇద్ద‌రిని సేఫ్ చేసే అవ‌కాశం కూడా ఉంది.

3205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles