ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో పురంధేశ్వ‌రిగా...

Sun,September 23, 2018 08:36 AM
himaansi chowdari to play ntr daughter in ntr biopic

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో ఎన్టీఆర్ అనే ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య న‌టిస్తుండ‌గా, ఆయన సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుంది. ఇక‌ ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తున్నాడు. ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని స‌మాచారం. ఇక ఈ చిత్రంలో కీలకమైన ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి పాత్రను ఎవరు చేయబోతున్నారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఈ పాత్రలో విజయవాడకు చెందిన హిమాన్సి చౌదరి అనే డ్యాన్సర్‌ పురంధరేశ్వరి పాత్రలో కనిపించబోతోందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. పురంధరేశ్వరి, హిమన్సీ కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో దాదాపు హిమాన్సి.. పురంధరేశ్వరి పాత్రకు ఫైనల్ అయినట్టు సమాచారం.దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.

4195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles