దీప్‌వీర్ పెళ్ళికి భారీ భ‌ద్ర‌త‌..బోట్ల ద్వారా ప్ర‌త్యేక నిఘా

Wed,November 14, 2018 12:23 PM
high security for deepveer wedding

బాలీవుడ్ ల‌వ్‌బ‌ర్డ్స్ ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొణేల వివాహం నేడు ద‌క్షిణ భార‌తీయ (కొంక‌ణీ)సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నుండ‌గా, భార‌తీయ కాల‌మానం ప్ర‌కారం 9గంట‌ల నుండే కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టేశారు. వీరి పెళ్ళి కోసం బాలీవుడ్ సెల‌బ్స్ షారూఖ్ ఖాన్, అనీల్ క‌పూర్ , క‌ర‌ణ్ జోహార్ త‌దిత‌రులు ఇప్ప‌టికే ఇటలీ చేరుకున్నట్టు స‌మాచారం. అయితే వీరి పెళ్ళి వేడుక‌కి అత్యంత స్థాయిలో భారీ భ‌ద్ర‌త క‌లిపించారు. ఇంటర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, వచ్చే అతిధులు, వీక్ష‌కుల చేతికి బ్యాండ్ వేస్తార‌ట‌. కెమెరాల‌కి స్టిక్క‌ర్స్ అతికించి లోపల‌కి పంపుతార‌ట‌. శుభ‌లేఖ‌ల‌కి క్యూ ఆర్ కోడ్ అనుసంధానం చేసి ఉండ‌గా, ఆ కోడ్‌ని స్కాన్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే లోప‌ల‌కి అనుమ‌తినిస్తార‌ట‌. ఇక రెండు రోజులు ప‌ర్యాట‌కుల‌కి అనుమ‌తి లేద‌ట‌. సెక్యూరిటీ గార్డులు ఎప్ప‌టిక‌ప్పుడు బోట్ల ద్వారా నిఘా కాస్తార‌ట‌. చాటుగా ఫోటోల‌ని తీసుకునే వారి ప‌ట్ల ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. దీపికకు సంబంధించిన కార్యక్రమాలను లేక్‌ కోమోకు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ విల్లాలో నిర్వహిస్తున్నారు. ఇక వరుడు రణ్‌వీర్‌కు సంబంధించిన కార్యక్రమాలను లేక్‌ కోమో సరస్సు తీరంలోని కాస్తాదీవా అనే అల్ట్రా లక్జరీ రిసార్ట్‌లో జరుపుతున్నారు.

1134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS