కోర్టు మేటర్ లో కాజల్ కి కాస్త ఊరట

Thu,October 12, 2017 11:39 AM
high court stay for kajal case

కలువ కళ్ళ సుందరి కాజల్ 2008లో వీవీడి కొబ్బరి నూనె కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది కాజల్. అయితే ఏడాది తర్వాత కూడా ఆ యాడ్ టీవీలలో ప్రసారం కావడంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఒప్పందం ముగిసినప్పటికి తన ఫోటోను ఆ సంస్థ వాడుకుంటుందని అందుకు నష్టపరిహారంగా ఆ సంస్థ రెండున్నర కోట్లు చెల్లించాలంటూ ఆదేశం ఇవ్వాలని కాజల్ కోర్టుని కోరింది. దీనిపై తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్ టీ రవీంద్రన్ 60 సంవత్సరాల పాటు ఆ యాడ్ పై హక్కులు ఆ సంస్థకి ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో యాడ్ ని ఏడాది తర్వాత ప్రసారం చేయకూడదని కాజల్ డిమాండ్ చేయడం తప్పు అని అన్నారు. దీంతో కాజల్ కి ఆ కోర్టులో చుక్కెదురైంది. దీంతో ఈ అమ్మడు మద్రాసు హైకోర్టుని ఆశ్రయించగా, అక్కడ ఈ అమ్మడికి ఫలితం అనుకూలంగా మారింది. కాజల్ వేసిన పిటీషన్ నేపథ్యంలో హైకోర్టు స్టే విధించింది. విజయ్ సరసన ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం అక్టోబర్ 18 న విడుదల కానుంది.

1774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles