స్టార్ డైరెక్ట‌ర్‌కి షాక్ ఇచ్చిన హైకోర్టు

Thu,February 22, 2018 12:05 PM
high court shocks to gautham menon

త‌మిళ ద‌ర్శకుడు గౌత‌మ్ మీన‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. టాలీవుడ్‌లోను మంచి హిట్ సినిమాలు తీశాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే గౌత‌మ్ మీన‌న్‌కి మ‌ద్రాసు హైకోర్టు షాక్ ఇవ్వ‌డం కోలీవుడ్ నాట హాట్ టాపిక్‌గా మారింది. వివ‌రాల‌లోకి వెళితే గౌత‌మ్ మీన‌న్‌పై మూడు దేశ‌ద్రోహం కేసులు ఉన్న నేప‌థ్యంలో కచ్చదీవుల్లోని అంథోనియార్‌ దేవాలయంలో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయ‌న‌కి అనుమ‌తి లేదు. ఇందుకోసం నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్ ధ్రువపత్రాన్ని పొందేందుకు అనుమతి ఇవ్వాలంటూ గౌతమ్ మీనన్ పిటిషన్ వేశారు. పిటీష‌న్‌ని స్వీక‌రించిన న్యాయ‌మూర్తి ఎంఎస్ ర‌మేష్ అనుమ‌తి ఎందుకు ఇవ్వ‌డం లేదు అని ప్ర‌శ్నించ‌గా, పోలీసుల త‌ర‌పున ప్ర‌భుత్వ న్యాయ‌వాది రాజా కోర్టుకి హాజ‌రై గౌత‌మ్ మీన‌న్‌పై ఉన్న కేసుల గురించి కోర్టుకి వివ‌రించారు. దీంతో మ‌ద్రాస్ కోర్టు గౌతమ్ మీనన్ ఉత్సవాలకు వెళ్లేందుకు నో చెప్పింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేశారు.

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles