తండ్రి, కొడుకులు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం..!

Tue,October 22, 2019 11:53 AM

కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌లో జోష్ నింపేందుకు ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేష్ మెహతా సిద్ద‌మ‌య్యారు. నిన్న చెన్నైలో జరిగిన ఆదిత్మ వ‌ర్మ ఆడియో వేడుక‌లో 2021-22 సంవత్సరాలలో విక్రమ్,ధృవ్ హీరోలుగా ఓ భారీ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్ చిత్రంగా ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. విభిన్న క‌థా చిత్రాలు చేస్తున్న విక్ర‌మ్ త‌న త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌ని అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌యం చేస్తున్నాడు. వచ్చే నెల 8న విడుదల కానున్న ఈ చిత్రంలో బనిత సంధు,ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా నటించారు. గిరీశాయ దర్శకత్వంలో మూవీ తెరకెక్కింది. ఇక విక్రమ్ న‌టించిన ధ్రువ నక్షత్రం, పొన్నియిన్ సెల్వం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ప్ర‌స్తుతం త‌న‌ 58వ చిత్రంతో బిజీగా ఉన్న విక్ర‌మ్ ఇందులో 25 గెటప్స్ లో కనిపిస్తార‌ని టాక్.

2181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles