వాట్సప్ గ్రూప్ లో క్వీన్ హీరోయిన్స్

Thu,October 5, 2017 10:00 AM
heroines created whats app group

టెక్నాలజీ పెరగడంతో దూరాలు తగ్గుతున్నాయి. ఇందుకు మెయిన్ బేస్ సోషల్ మీడియా. దీనివల్ల హ్యూమన్ రిలేషన్స్ మాట ఎలా ఉన్నా రిలేషన్స్ మాత్రం పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకటిగా ఉన్న వాట్సప్ వాడని వారంటూ లేరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులోనూ గ్రూప్ వాట్సప్ కూడా వచ్చింది. ఈ మ‌ధ్య ప్రతి చిన్న విష‌యానికి వాట్సాప్ గ్రూప్ సృష్టించ‌డం అల‌వాటుగా మారింది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు.

కాజల్, తమన్నా, పారుల్ యాద‌వ్, మంజిమా మోహ‌న్‌లు కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? అంటే ఓ విధంగా అవుననే చెప్పాలి. ఒకే సినిమాలో యాక్ట్ చేస్తున్నా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేస్తున్నారు. హిందీ మూవీ`క్వీన్‌` తెలుగు రీమేక్ `క్వీన్‌` లో త‌మ‌న్నా, త‌మిళ రీమేక్ `పారిస్ పారిస్‌`లో కాజ‌ల్ నటిస్తున్నారు. ఇక క‌న్నడ రీమేక్ `బ‌ట‌ర్ ఫ్లై`లో పారుల్ యాద‌వ్‌, మ‌ల‌యాళ రీమేక్ `జామ్ జామ్‌`లో మంజిమా మోహ‌న్‌లు నటిస్తున్నారు

నాలుగు భాష‌ల్లో ఒకేసారి షూటింగ్ జ‌రుపుకుంటున్న క్వీన్ సినిమా వివ‌రాల‌ను ఆయా నటీనటులు, టెక్నీషియన్స్ తో ఎప్పటి క‌ప్పుడు పంచుకోవ‌డానికి మూవీ యూనిట్ ఈ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసింది. ఇందులో నలుగురు హీరోయిన్స్ సభ్యులుగా ఉన్నారు. ఇలా నాలుగు భాషల సినిమా పర్సన్స్ తో వాట్సప్ గ్రూప్ రావడం ఇదే మొదటిసారి అని కూడా తెలుస్తోంది.

2096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles