ఫోటోలు: జవాన్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన మెహ్రీన్

Sun,November 19, 2017 10:59 PM
ఫోటోలు: జవాన్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన మెహ్రీన్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 1న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా ఈ రోజు ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్‎లో గల పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన కొన్ని పోస్టర్లను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా, ఇవి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ధ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి సంగీత ప్రియులని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి జవాన్ లోని క‌థానాయకుడు లాంటి వాడు ఉండాలని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. ఈ మూవీ తేజూకి మంచి పేరు తీసుకొస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక.. ఈ మూవీ హీరోయిన్ మెహ్రీన్.. జవాన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయి సందడి చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇవే..

1336

More News

VIRAL NEWS