రామ్ సినిమాకు హీరోయిన్ దొరికింది..

Mon,January 28, 2019 05:43 PM
Heroine finalized for ismart shankar movie

పూరీజగన్నాథ్-రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పూరీ ఈ సినిమా కోసం హీరోయిన్ ను ఎంపిక చేశాడు. పూరీ అండ్ టీం సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్ ను రామ్ కు జోడీగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఛార్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ ప్రాజెక్టుకు నటి ఛార్మి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. నిధి అగర్వాల్, అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

2884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles