వెంకటేష్ కొత్త సినిమా 'రాజారత్నం'..?

Sat,November 21, 2015 02:41 PM
Hero Venkatesh to act in director maruthi's new film

'భలే భలే మగాడివోయ్' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు మారుతి వెంకటేష్‌తో ఓ సినిమా చేయనున్నారు. నయనతార ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా చిత్రానికి 'రాజారత్నం' అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

'గోపాల గోపాల' సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమాను ఇంకా ప్రారంభించలేదు. కాగా ఆయన 'రాజారత్నం'లో ఓ డిఫరెంట్ రోల్ చేయబోతున్నాడని సమాచారం. ఇందులో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని, మరో వైపు తన నటనతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనున్నారని సినీ వర్గాల ద్వారా తెలిసింది.

2598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles