నిఖిల్ 'శ్వాస' ప్రీ లుక్ విడుద‌ల‌

Fri,October 19, 2018 10:18 AM
hero nikhil swaasa pre look released

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం ముద్ర అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. టీఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైన‌మిక్స్‌, ఎల్ఎల్‌పి ప‌తాకాల‌పై కావ్య వేణుగోపాల్‌, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తాజాగా నిఖిల్ మ‌రో చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. కిష‌న్ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో శ్వాస అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని చేయ‌నున్నాడు నిఖిల్. ఇందులో నివేదా థామ‌స్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. తేజ్ ఉప్ప‌ల‌పాటి మ‌రియు హ‌రినికేష్ రెడ్డి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వాస చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఇది చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది.

1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS