మామ రాజ‌కీయ ప్ర‌వేశం పై ధ‌నుష్ కామెంట్స్!

Mon,June 26, 2017 11:52 AM
Hero Dhanush Comments on  Rajinikanth Politics Entry

ముంబ‌యి: హీరో ధ‌నుష్ త‌న మామ సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి త‌న దైన శైలిలో స్పందించాడు. త‌న లేటెస్ట్ మూవీ వీఐపీ2 త‌మిళ్ ట్రైల‌ర్ లాంచ్ కోసం ముంబ‌యి వ‌చ్చిన ధ‌నుష్ పై మీడియా ర‌జినీ రాజ‌కీయ ప్ర‌వేశం పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. "మీకు ట్రైల‌ర్ లాంచ్ కోస‌మే క‌దా ఆహ్వానం అందింది... పాలిటిక్స్ ఎంట్రీ పై చ‌ర్చించ‌డానికి కాదు క‌దా..." అంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చాలా తెలివిగా స‌మాధానాలిచ్చాడు. అయినా.. ధ‌నుష్ ను రిపోర్ట‌ర్లు వ‌ద‌లకుండా... సినిమా న‌టులు ఖ‌చ్చితంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలా? దానిపై మీ అభిప్రాయం ఏంటంటూ అడ‌గ‌గా... "సినిమా న‌టులు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వ‌కూడ‌ద‌ని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకూ ఓ అభిప్రాయం ఉంటుంది కదా.. అలాగే నాకూ ఓ అభిప్రాయం ఉంటుంది.. మీ అభిప్రాయానికి మీరు క‌ట్టుబ‌డి ఉండండి.. నా అభిప్రాయానికి నేను క‌ట్టుబ‌డి ఉంటా" అంటూ స‌మాధానం ఇవ్వ‌డంతో ర‌జినీ పాలిటిక్స్ ఎంట్రీ పై ఇంకా క్లారిటీ మాత్రం రావ‌ట్లేదు.

4235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS