చిరు నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో నాని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లోని గురుజాడ కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనిరుధ్ సీను సిరిగి.. సీట్లు ఇరిగి.. సీటి కొట్టాలోయీ అనే ప్రమోషనల్ సాంగ్‌ని ఆలపించగా, ఈ పాటకి నాని, ప్రియాంక, కార్తికేయలు స్టేజ్‌పైన స్టెప్పులు వేసి అలరించాడు. ఇక మేకర్స్ చిత్ర మేకింగ్ వీడియోతో పాటు హోయినా హోయినా అనే సాంగ్ వీడియో విడుదల చేశారు . ఇవి రెండు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. మేకింగ్ వీడియోలో దర్శకుడు విక్రమ్ కుమార్ కంటతడి పెట్టుకోవడం చూపించారు. ఎంతో సరదాగా చిత్ర షూటింగ్ జరిగినట్టు మేకింగ్ వీడియోని బట్టి అర్దమవుతుంది. చిత్రంలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్‌గా కనిపించి అలరించనున్నాడు. పెన్సిల్ పార్ధసారధి పాత్రలో నాని నటిస్తుండగా, ఆయన ఫేమస్ రివెంజ్ రైటర్‌గా అలరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు.

