రాక్ష‌సుడు మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,April 6, 2019 11:33 AM

వరుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం హ‌వీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్‌లో ఏ స్టూడియో పతాకంపై రాక్ష‌సుడు అనే చిత్రం చేస్తున్నాడు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన రాచ్చసన్ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతుంది. రైడ్, వీర చిత్రాల ఫేమ్ రమేష్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు 60 శాతం పూర్తయింది. ఉగాది సంద‌ర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో బెల్లంకొండ శీను, అనుప‌మ షాక్‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో సీత రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

2474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles