బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్ జాబితా ఇదేనా..?

Sun,June 10, 2018 04:30 PM
Here is the Bigboss 2 contestants list

ప్రేక్షకులు బిగ్‌బాస్ 2 రియాలిటీ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ 2 షో నేడు గ్రాండ్‌గా షురూ కానుంది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొంటున్న అభ్యర్థుల జాబితా ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్ జాబితాలో సినిమా సెలబ్రిటీలతోపాటు ప్రేక్షకులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.

ప్రముఖ హేతువాది బాబు గోగినేని పేరు బిగ్‌బాస్ 2 జాబితాలో ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. టీవీ 9 యాంకర్ దీప్తి, గీతామాధురి, తేజస్వి, శ్యామల, కిరిటీ దామరాజు, దీప్తి సునైనా, రోల్ రిడా, భాను, హీరో తనీష్, అమిత్ తివారీ, నటుడు సామ్రాట్, కౌశల్‌తోపాటు ప్రేక్షకుల నుంచి గణేశ్, సంజన, నూతన్ నాయుడు పేర్లు ఉన్నాయి. మరీ బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్ వీరేనా అనే విషయం తెలుసుకోవాలంటే ఇవాళ రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.

8807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles