'గూఢచారి' టీజర్ వచ్చేసింది

Wed,July 4, 2018 04:15 PM
Here Comes The Teaser Of Adivi Sesh Goodachari

‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. ఆయన నటించిన తాజా చిత్రం ‘గూఢచారి’. శోభిత ధూలిపాళ్ల హీరోయిన్. ప్రకాష్రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆగస్ట్ 3న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా చిత్ర టీజర్ సమంత చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఏజెంట్ పాత్రలో అడవి శేష్ లుక్ అదిరిందని అంటున్నారు.

అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్స్ మర్చంట్ బ్యానర్ లపై అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమా చిత్రీకరణ అధిక భాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పుణే, న్యూ ఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్ లలో జరిగింది. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా.. శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. మరి తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles