మొన్న కిక్.. నేడు క్రాక్

Thu,November 14, 2019 08:12 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ అతి త్వ‌ర‌లో డిస్కోరాజా చిత్రంతో సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత త‌న 66వ చిత్రాన్ని గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. ఈ మూవీ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించ‌నున్నాం అని గోపిచంద్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు. నవంబ‌ర్ 14న ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. క్రాక్ అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేయ‌గా పోస్ట‌ర్‌లో ర‌వితేజ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. కిక్ చిత్రంలో ఫుల్ కామెడీ పంచిన ర‌వితేజ క్రాక్ చిత్రంతో కేక‌పెట్టిస్తాడ‌ని అభిమానులు అంటున్నారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు . శృతి హాస‌న్ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles