'హ‌లో' సంగ‌తులు చెప్పేశారు

Tue,November 14, 2017 04:17 PM
hello teaser release time fixed

అక్కినేని వార‌సుడు అఖిల్.. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో హ‌లో అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ న‌టిస్తుంది. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ఈ రోజు నుండి మొద‌లు పెడుతామ‌ని నాగ్‌, అఖిల్‌లు నిన్న‌ ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో హాలో సినిమాకి సంబంధించి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ, ఆ పోస్ట‌ర్ ద్వారా టీజ‌ర్ డేట్ మ‌రియు సినిమా రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించారు. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్‌లో విక్ర‌మ్ కుమార్ ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడా అన్న ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అయితే ఈ రోజే చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేస్తార‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికి కేవ‌లం పోస్ట‌ర్‌తో మాత్ర‌మే స‌రిపెట్టి న‌వంబ‌ర్ 16న టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్- వినోద్ సంగీతాన్ని అందిస్తున్నారు.


1559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles