హలో ‘వెడ్డింగ్ సాంగ్’ విడుదల

Wed,December 6, 2017 02:51 PM
hello song released

తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న అఖిల్ రెండో సినిమా ద్వారా పక్కాగా హిట్ కొట్టాలనే కసితో హలో సినిమా చేసినట్టు తెలుస్తుంది. ఇక నాగార్జున కూడా ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడని తెలుస్తుంది. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ మధ్యే టీజర్, ట్రైలర్ తో అలరించిన హలో చిత్ర యూనిట్ తాజాగా హలో వెడ్డింగ్ అనే సాంగ్ విడుదల చేసింది. ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. అనూప్ మరోసారి తనదైన స్టైల్ లో బాణీలు అందించాడు. అఖిల్ నిన్ననే తన ట్విట్టర్ ద్వారా ఓ సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. అది మ్యూజికల్ సర్ ప్రైజ్ అని తాజాగా అర్ధమైంది. ఇక త్వరలో రానా, అఖిల్ లు యూఎస్ కి సినిమా ప్రమోషన్ కోసం వెళ్లనున్నారు. విక్రమ్ కుమార్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన హలో వెడ్డింగ్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

2278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles