టీజ‌ర్‌తో ఆస‌క్తి రేకెత్తించిన 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'

Tue,September 18, 2018 09:37 AM
Hello Guru Prema Kosame Teaser  released

కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కుర్ర‌ హీరో రామ్ పోతినేని. చివ‌రిగా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ ప్ర‌స్తుతం నేను లోక‌ల్ ఫేం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు మూవీ మేక‌ర్స్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కూర్చొని సాంబ్రానితో తలను ఆరబెట్టుకుంటూ అందాలతో ఊరిస్తుంటే.. అటుగా వచ్చిన రామ్ తదేకంగా చూస్తుండిపోవడం.. చూశావా? నీ కోసమే.. అంటూ ఉల్లిపొర లాంటి చీరను సర్దుకుంటూ.. ఎలా ఉంది? అని అడగటం.. రామ్ హాట్‌గా ఉంది కాఫీ అని చెప్పడం.. బ్యాక్ గ్రౌండ్‌లో దేవి శ్రీ ప్రసాద్ సందర్భానుసారంగా రొమాంటిక్ మ్యూజిక్ అందివ్వడాన్ని బట్టి ఈ మూవీలో గ్లామర్ హంగులు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ టీజర్ 3 గంటల్లో 5 లక్షల వ్యూస్‌ని, 1 మిలియన్ వ్యూస్‌ని 6 గంటలలోపే రాబట్టి రికార్డు సృష్టించింది. మ‌రి ఈ సినిమా రామ్‌కి మంచి హిట్ అందిస్తుందా అనేది చూడాలి.

1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS