బిగ్ బాస్ హౌజ్‌లోకి కుమారి 21 ఎఫ్ భామ‌..!

Sun,August 4, 2019 11:12 AM
hebba patel enter into bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం గ‌త రెండు సీజ‌న్స్ క‌న్నా స‌క్సెస్ ఫుల్ టీఆర్‌పీతో దూసుకెళుతుంది. ఈ కార్య‌క్ర‌మంపై మ‌రింత హైప్ తీసుకొచ్చేందుకు నిర్వాహ‌కులు ప‌లు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. గ‌త రెండు సీజ‌న్స్‌లో ఎలాంటి ప్ర‌యోగాలు చేయ‌ని టీం ఈ సారి ట్రాన్స్‌జెండ‌ర్‌ని బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపింది. దీంతో షో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఇద్ద‌రు టాలీవుడ్ భామ‌లు రానున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఒ భామ రేయ్ సినిమాలో జెన్నాగా పవర్‌పుల్ ప్రతినాయిక పాత్రలో నటించి తన ఇమేజ్ అమాంతం పెంచేసుకున్న‌ యంగ్ హీరోయిన్ శ్ర‌ద్దాదాస్ కాగా, మ‌రొక‌రు ఎవ‌రు అనే దానిపై సందిగ్ధం నెల‌కొంది. ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం హెబ్బా ప‌టేల్ శ్ర‌ద్ధాతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న‌ట్టు తెలుస్తుంది.

అలా ఎలా చిత్రం తో తెలుగు తెర‌కి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బాకి ఈ చిత్రం తో అంతగా గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత చేసిన 'కుమారి 21ఎఫ్' చిత్రం తన ఫేట్ నే మార్చేసింది. వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ఈడో రకం ఆడో రకం , ఏంజేల్ అనే ప‌లు చిత్రాలలో న‌టించింది. ఏ చిత్రం కూడా త‌న‌కి మంచి విజ‌యాన్ని అందించ‌లేదు. ఈ మేరకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి త‌న స‌త్తాని నిరూపించుకోవాల‌ని హెబ్బా భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

4247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles